మృగమే మేలు;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 తల్లి గర్భంలో 9 నెలలు ఉండి  చీకటిని అనుభవించిన బిడ్డ  ఈ భూమి మీదకు వెలుగులోకి వస్తుంది  చీకటిలో ఉన్న ప్రతి వ్యక్తి వెలుగును చూడడానికి ప్రయత్నం చేస్తాడు  చంటి బిడ్డ నుంచి ముదుసరి వరకు  ప్రతి ఒక్కరూ దానికోసం ప్రయత్నం చేస్తారు  చీకటిలో ఎంత వెతికినా ఏ వస్తువు మనకు కనపడదు కదా  అలాగే బుద్ధి మాద్యం ఏర్పడినప్పుడు  మెదడు మొత్తం చీకటితో నిండి ఉంటుంది  ఏ పని చేయాలో  ఏది చేస్తే తనకు సహాయకారిగా ఉంటుందో మంచి ఏదో చెడు ఏదో విచక్షణ తెలుసుకోలేని స్థితిలో అతను ఉంటాడు  మనిషి అంటేనే మనీష కలిగిన వాడు బుద్ధి కలిగిన వాడు అని అర్థం  చీకటిలో ఉన్నాడు అంటే అజ్ఞానంలో ఉన్నాడు  ఆలోచనా శక్తి లోపించింది అని చెప్పడం  మనిషికి మృగానికి ఉన్న భేదం ప్రత్యేకంగా అదే
పిల్లలు ఎవరైనా  కాని పని చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు పెద్దలు మందలిస్తూ  ఒరేయ్ పశువు ప్రవర్తించినట్లుగా ఉండకు రా  మనిషిగా నీ అంతట నీవు ఒక నిర్ణయం తీసుకొని మంచి పని కోసం  పాటుపడరా అని చక్కటి సలహా ఇస్తూ ఉంటారు  ఒకటికి రెండు సార్లు చెప్పినా అతని పద్ధతి మార్చుకోకుండా  ఇతరులకు కష్టం కలిగే పనులు చేస్తూ వేడుక చూస్తూ ఉంటే  వాడిని పశువుగా  ఒక మృగంగా  భావించి  వాడు ఒట్టి మృగం రా  వాడి జోలికి వెళ్ళకండి  గాడిద జోలికి వెళితే ఏమవుతుంది  కాలితో ఒక తన్ను తంతుంది  అంతే తప్ప దాని పద్ధతి మార్చుకో  దు  అలాగే చనిపోతాడు  కూడా. కనుక వాడి జోలికి వెళ్ళవద్దు  అలా కాదు ఇలా చేయమని సలహాలు కూడా ఇవ్వవద్దు అని గట్టిగా చెబుతారు  అది విన్న తర్వాత కూడా అతనికి మనసు మారదు. ఈ లక్షణాలు కలిగిన వాడిని  మూర్ఖునిగా జమ కడతాడు వేమన  మృగానికి తెలివి లేదు  పేడ కానీ మూత్రం కానీ ఎక్కడ విసర్జించాలో తెలియదు  ఫలానా స్థలంలో వేయాలని  దానికి ఉండదు  అలాగే మూర్ఖునికి  ఈ పని చేయాలి, ఆ పని చేయాకూడదు అన్న ఆలోచన ఉండదు ఏ పని చేసినా ముర్ఖపు పద్ధతిలో  ఎవరూ మార్చలేని విధంగా  అతని ప్రవర్తన ఉంటుంది  మంచి మనిషికి ఒక మంచి మాట చాలు తన ప్రవర్తన మార్చుకుంటాడు ఇలాంటి మూర్ఖులకు ఎన్ని చెబితే మాత్రం అర్థం అవుతుంది  వాడు పట్టిన పట్టు అంతే  వాడిని మార్చడం ఆ బ్రహ్మ తరం కూడా కాదు  వాడిని మృగము కన్నా హీనంగా చూస్తారు. సాటి స్నేహితుడు కానీ బంధువులు కానీ ఎవరైనా అలా మూర్ఖంగా పశువులా ప్రవర్తించవద్దు అని  వేమన మనకు నీతి బోధ చేస్తున్న విషయం ఆ పద్యాన్ని చదవండి.

"మృగము మృగమనుచును మృగముల దూషింత్రు మృగము కన్నా జెడుగు మూర్ఖుడగును 
మృగము కన్న గుణము  మూర్ఘునికే లేదు..."కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం