ఈ సమాజంలో ఉన్న వ్యక్తులను మేధావి వర్గం మూడు రకాలుగా విభజించింది. ఆధ్యాత్మిక భాషలో సాత్వికము రాజసము, తామసము అంటారు. వీరికి వరుసగా ఉత్తములు, మధ్యములు, నీచులు అని పేరు పెట్టారు. అలాగే వేమన కూడా ఆ మూడు రకాల మనుషుల మనస్తత్వం అని తెలియజేయడానికి అద్భుతమైన ఆటవెలదిని మన ముందు ఉంచారు. వారి దృష్టిలో రాజులు, యోగులు, మూర్ఖులు ఈ మూడు తత్వాల మనుషుల మనస్తత్వాలను అద్భుతంగా ఆవిష్కరించడమే కాక వారు ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు దేనికైనా అభిరుచి ఉండాలి కదా ఈ ముగ్గురి అభిరుచి దేని మీద ఎలా ఉంటుంది అన్న విషయాన్ని విడమర్చి అందరికీ అర్థమయ్యే పరిభాషలో చెప్పాడు వేమన నిజమైన మానసిక వేత్త అని చెప్పాలి.
మొదట వర్గాన్ని యోగులుగా అభివర్ణిస్తూ వారి లక్ష్యం జీవితంలో ఏమి ఉంటుందో భౌతికమైన ఈ భోగాలన్నిటిని పరిహరించి పరలోకంలో మోక్షాన్ని పొందాలి అన్న అభిప్రాయంతో దానికోసం సాధన చేయడానికి ప్రారంభం చేస్తారు ఏ సాధన చేయాలన్నా ముందు ఆలోచన రావాలి తరువాత దానిని కార్యరూపంలో పెట్టాలి పెట్టిన తర్వాత మనసును నిశ్చలంగా ఉంచుకొని దాని మీదనే మనసుపెట్టి తపస్సమాధికి వెళ్ళినప్పుడు మాత్రమే తన ఆశయాన్ని సాధించినవాడు అవుతాడు రెండో వర్గాన్ని రాజులుగా వస్తే రాజస ప్రధానంగా జీవించేవారు కనుక వారి దృష్టి పరిపాలన సుభిక్షంగా ఉండాలి అన్న కోరిక ఉంటుంది దానికోసం యుద్ధాలకు కూడా సిద్ధమవుతారు దానితో శత్రువుల పీడ వదిలించి వీరికి మంచి జీవితాన్ని ఇచ్చి తాను మంచి రాజుగా నిరూపించుకుంటాడు.
చివరి స్థితిలో ఉన్న వారిని మూర్ఖుడిగా చెప్పాడు వేమన వారికి కావలసింది పూర్తిగా ఈ భౌతిక సుఖాలు మాత్రమే ఒమర్ ఖయాం లాగా సాకీతో ద్రాక్ష రసపానం చేస్తూ ఆమెతో కేళి విలాసాల కోసం ఆరాటపడుతూ ఉంటాడు. ఎక్కడ స్త్రీ కనిపించినా ఆమె పొందు కావాలని ప్రయత్నం చేసి విఫలమై ఒక్కొక్క సందర్భంలో కాలు చేయి తీయించుకునే స్థితికి కూడా పాల్పడతాడు. అయినా ఆ వాంఛ చావదు. నిన్న జరిగిపోయింది రేపు ఎలా ఉంటుందో తెలియదు ఉన్నది నేడే దానిని పూర్తిగా అనుభవించు అని ఖయాం చెప్పినట్లుగానే దానిలో మునిగి తేలుతూ ఉంటాడు అదే స్వర్గం అదే నరకం అదే సర్వస్వం మరి అలాంటి మూర్ఖులను వేమనే కాదు మరి ఎవరైనా మార్చగలరా అంటే అది అసాధ్యమని అందరికీ తెలుసు ఆ పద్యాన్ని ఒకసారి చదవండి.
"పరమపదవి గోరు భక్తుండు నిత్యము
రాజు గోరుచుండు రణ జయంబు
మూర్ఖుడెపుడు గోరు ముదితలతో పొందు..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి