అజ్ఞానతిమిరాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి తన అజ్ఞానము అనే చీకటిని తొలగించే వ్యక్తి కోసం అన్వేషిస్తూ జీవితంలో కొంతకాలం గడిపి వారి మాటల వల్ల వీరి మాటల వల్ల ఒక వ్యక్తి మంచితనాన్ని తెలుసుకొని వారి వద్దకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకుని నేను మీ వద్ద శిష్యునిగా చేరి జ్ఞానాన్ని సముపార్జించాలని అనుకుంటున్నాను అని ప్రార్థించి వారి అంగీకారంతో వారి శుశ్రూష చేస్తూ తనకు కావలసిన విద్యను అభ్యసించి దానిలో నిష్ణాతుడు అవుతాడు సరియైన గురువు దొరక్కపోతే అతని విద్య కుదురుగా జరగదు తనకు సంతృప్తికరమైన జ్ఞానం పొందలేడు జ్ఞానం కోసం తగిన గురువును ఎన్నుకోవడం ప్రథమ లక్షణం. శిష్యుడిగా లేకుంటే డొక్క శుద్ధి లేనివాడి గానే మిగిలిపోతాడు.
ఏ గ్రామాన్ని గమనించినా పూర్వకాలం నుంచి మనకు తెలిసి కాపు గారు ఉండేవారు బలహీన వర్గాలను కాచి రక్షించడానికి అతని బలగం రక్షణగా నిలుస్తోంది కనుక వారు కాపులుగా మిగిలిపోతారు అలా కాపు లేని ఏ గ్రామమైనా అనేక చిక్కులలో ఇరుక్కుపోతుంది ఏ చిన్న తగాదా వచ్చినా న్యాయం చెప్పేవారు ఉండరు దానితో తగాదాలు కొట్లాటలు మొదలవుతాయి. గ్రామం ఛిన్నాభిన్నం అవుతుంది కనుకనే భూమి తల్లి మన సంసారంలో ఏ ఆడపిల్ల అయినా తన రక్షణ కోసం ఒక మగవాడు భర్తగా కావాలని ఆశిస్తారు. అలాగే భూమాత కూడా తనను కాచి రక్షించే వ్యక్తి కావాలని కోరుకుంటుంది ప్రజలు రాజు గారిని ఎన్నుకొని ఆయన పాలన ప్రారంభించిన తర్వాత కానీ ధరణి తృప్తి చెందదు అని చెపుతున్నాడు వేమన. సమాజంలో ఒక వ్యక్తి ఈ భూమి మీదకు వచ్చిన ఏ ప్రాణి అయినా శుద్రాముతోనే వస్తుంది దానికి దివ్యత్వాన్ని ఆపాదించాలి తనలో ఉన్న క్షుద్రత్వాన్ని నిర్మూలించాలి దానికి తగిన సమయం సందర్భం రావాలి. బిడ్డను విద్యావంతుడిగా చేయడం కోసం ఆ బిడ్డ పుట్టిన ఐదు సంవత్సరముల ఐదు నెలల ఐదు రోజులు నిండిన తరువాత అతనికి ముండనము చేయించి (బోడి గుండు) ఇంటి ముందు నిలబెడితే మనసున్న ఏ గురువైన అతనిని తన వెంట తీసుకొని వెళ్లి వేద విద్యలన్నిటిని బోధించి అతనిలో ఉన్న అంధకారాన్ని తరిమివేస్తాడు అప్పుడు అతని రెండవ జన్మ ప్రారంభమవుతుంది దానినే ద్విజుడు అంటారు అతనిని ఆ స్థితికి తీసుకురావడం కోసం సద్గురువు కావాలి అంటాడు వేమన ఆ పద్యాన్ని చదవండి.
"గురువు లేక విద్య గుదురుగా దొరకదు నృపతి లేక భూమి తృప్తిగాదు
గురువు విద్య లేక గురుతరద్విజుడౌనె..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి