యముని దృష్టి; -ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మానవులలో రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉన్నారు  తన పనిని తాను సాత్వికంగా చేసుకుంటూ తనను తన కుటుంబాన్ని పోషించుకుంటూ గౌరవప్రదంగా జీవించేవాడు ఒక రకం  జీవితంలో బద్ధకానికి పెద్దపీట వేసి అతి చిన్న అవసరానికి కూడా  ఎదుటివారి దగ్గర చేతులు చాపి  జీవించడం మరొకరకం  ప్రక్క వారిని బెదిరించి  తన బలాన్ని చూపి  వారి దగ్గర ఉన్న ధనాన్ని  లాక్కోవడం  కాదు కూడదు అంటే చంపుతానని బెదిరించడం  నిజంగా అవతలవాడు ప్రాణానికి తెగించి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తే వాడిని నిజంగానే చంపి  హంతకుడుగా తయారై తన అవసరాలను తీర్చుకునేవారు  మరి కొంతమంది ఉన్నారు ఎవరి మార్గం మంచిది అని మనం చెప్పగలం  ఉత్తమంగా పనిచేసుకున్న వాడిని  బలహీనుడు అంటున్నాం లేకపోతే చేతగానివాడు అన్న బిరుదు తగిలిస్తాము.
ఏ మనిషి అయినా  ఆకలి భాషను తట్టుకోవడం కష్టం సమయానికి ఏదో ఒకటి తినకపోతే ప్రాణం నకనకలాడుతుంది  అది భరించడం కష్టం  మన పెద్దవాడు చెప్తూ ఉంటారు అవసరం దేనినైనా చేయిస్తుంది అది సాహసోపేతమైన ఇతరులకు సాధ్యం కానీ పని అయి ఉండవచ్చు  లేదు ఆకలికి ఓర్చుకోలేక  ఇతర గ్రామాలకు వెళ్లి  దోచుకుని  తన కడుపు నింపుకొని తర్వాత తన కుటుంబ  సంక్షేమం కోసం ఆలోచించడం  ఆ చేసే వ్యక్తికి తను చేసిన పని చెడు అని తెలియకుండా చేస్తున్నాడా  ఏ పని చేసినా ముందు తన ఆకలి బాధ తీరాలి అన్న  కోరికతో చేస్తున్నాడు  మనం చేసిన ఏ తప్పు కైనా శిక్ష ఉంటుంది అని ప్రతి చంటి పిల్లవాడికి కూడా తెలుసు  అయినా కొన్ని తప్పులు అలా చేస్తూనే ఉంటాం  అది తప్పని పరిస్థితి అయితే సహజంగా ఇలాంటి తప్పులు చేస్తున్న ప్రతి వ్యక్తి  నన్ను ఎవరూ చూడడం లేదు  నాకు శిక్ష పడదు అనుకుంటూనే చేస్తాడు. మన పెద్దలు కొన్ని సూక్తులు చెబుతూ ఉంటారు  శివుని ఆజ్ఞ లేకపోతే చీమ అయినా  కదలదు అని  అలాంటిది ఇలాంటి  దొరగాతాలు శివుని దృష్టికి రాకుండా ఉంటాయా  ఇలా తప్పులు చేస్తున్న వాడు తనను తాను రక్షించుకోవడం కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం మరొక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం వెళ్లి  తన ఉనికిని తెలియకుండా చేద్దాం అని అనుకుంటాడు  వారు ఎక్కడ ఎలా దాగుకున్నా  యమునికి ఆ క్షణంలోనే తెలుస్తుంది  తెలిసిన మరుక్షణమే అతనికి శిక్ష విధించబడుతుంది అని మన వేమన చెప్తున్న విషయం మరి ఆ పద్యాన్ని చదవండి.

"పెక్కుజనుల గొట్టి పేదల వధియించి  డొక్క కొరకు 
నుడ్లు దొంగిలించి ఎక్కడికరిగినను నెరికి యముడు చంపు..."


కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం