భారతీయ పురాణాలను అనుసరించి మనిషికి పుట్టుకను ఇచ్చిన బ్రహ్మ సృష్టికర్త అంటారు ఈ సృష్టికి మూలం వారే అన్నది భారతీయుల ప్రగాఢ నమ్మకం ఈ భూమి మీదకు వచ్చిన ఆ బిడ్డను పెంచి పోషించే బాధ్యతను విష్ణుమూర్తి స్వీకరిస్తాడు అని లయకారుడైన శంకరుడు శం అంటే శుభాలను, కరుడు కలుగ చేసేవాడు. ఆ వ్యక్తికి ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని ప్రసాదించి అతని ప్రవృత్తికి మార్గాన్ని ఏర్పాటు చేసినవాడు. శంకరుడు శంకలను తీర్చువాడు అని మరో అర్థం. శంక అంటే అనుమానం ర అంటే కూకటి వేళ్ళతో పెకలించేవాడు నేను ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాను ఎందుకు పెరుగుతున్నాను తిరిగి మళ్లీ మరో లోకంలోకి ఎందుకు ప్రయాణం చేస్తున్నాను అన్న విషయాలను తన అనుగ్రహం వల్ల తెలియజేసేవాడు.
అనసూయ భారతదేశంలో ఉన్న పతివ్రతా శిరోమణులలో ప్రథమ స్థానాన్ని పొందినది. ఎవరిపైనా అసూయ పడకుండా తన జీవితాన్నీ ఆశ్రమ ధర్మాన్నీ పాటిస్తున్నది. ఆమె భర్త అత్రి మహాముని అత్రి (మూడు లేవు ఉన్నది ఒకటే ఒక కణములో మూడు విభాగాలు ఎలా ఉంటాయో అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసే ఉంటారు) అని ముగ్గురిని ఒకటిగా చేసి దత్తాత్రేయ అన్న పేరును పెట్టారు వేమన విశ్వసించేది కూడా మూడు కన్నులు కలిగిన వాడిని ప్రతి ఒక్కరికి రెండు కళ్ళు ఉంటాయి శివునికి మాత్రమే మూడవ కన్ను ఉంటుంది ఆ త్రినేత్రుని (మూడోవది జ్ఞాన నేత్రం) ప్రేమను పొందగలిగిన వాడికి తప్ప సమాధిలో ఉండి వారిని సందర్శించుకున్న వ్యక్తికి మోక్షాన్ని ప్రసాదించేవాడు అన్న నమ్మకం ఉంది వేమనకు కూడా. మనసు నిండా వారి నామాన్ని నింపుకొని వారిని దృష్టిలో పెట్టుకొని వారిని మాత్రమే పూజించి అంకితభావంతో మనసా వాచా కర్మణా శంకర శబ్దము తప్ప మరొకటి లేకుండా మరణము చేయగలిగిన వాడికి తప్పకుండా మోక్షం ప్రాప్తిస్తుంది అని వేమన మహాశయుడు మనకు చెప్తున్నాడు ఆత్మ పరమాత్మను కలవాలి అనుకున్నప్పుడు ఆత్మను సంతృప్తి పరచడం కోసం శివనామ స్మరణ తప్ప మరొక మార్గం లేదు అని ప్రత్యేకంగా మనకు హిత వచనం పలుకుతున్నాడు వేమన ఆ నమ్మిన మనసుకు ఎలాంటి శంకలు ఉండకూడదు వేరే ఊహలు ఏమి రాకూడదు అన్నీ త్రికరణ శుద్ధిగా చేయాలి అని వేమన చెప్పిన ఆటగలదిని చదివితే మీకు కూడా ఆ విషయం సుబోధకమవుతుంది చదవండి మరి.
"బేసికంటి వాని పెంపార మది నిలిపి
పూజ చేయవలెను బుద్ధి నిలిపి ఆత్మ పూజ కంటే అదనంబు లేదయా..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి