మంచిని విను;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈ భూమి మీదకు వచ్చే ప్రతి బిడ్డకు  ప్రకృతి  పంచేంద్రియములను  ప్రసాదిస్తుంది. ఆకాశము నుంచి శబ్దము, వాయువు నుంచి స్పర్శ, అగ్ని ద్వారా  ఆకారం, జలము ద్వారా రుచి ధరణి ద్వారా వాసన  మానవులకు సిద్ధిస్తాయి  ఒక్కొక్క ఇంద్రియాలకి ఒక్కొక్క గుణం ఈ పంచేంద్రియాలలో ఏ ఒక్కటి పని చేయకపోయినా గుడ్డివాడని, మూగవాడని చెమిటి వాళ్ళని పేరు పెట్టి ఎగతాళి చేస్తూ ఉంటారు మిగిలినవారు. ప్రత్యేకించి చెవులను గురించి వేమన మనకు విశదీకరిస్తున్నాడు  మనిషికి చెవులు ఎందుకు ఉన్నాయి  ఎదుటివారు మాట్లాడినది విని  దానిని మెదడు ద్వారా అర్థం చేసుకుని  నోటి ద్వారా దానికి సమాధానం చెప్పే పద్ధతి  ఇది ప్రతి ఒక్కరికి అనుభవమే కదా. చదువులను గురించి పోతనామాత్యుడు  ప్రహ్లాదనితో చెప్పిస్తాడు  చదువులలోని మర్మ మెల్ల తెలిసితి పెద్దలు చెప్పడం వల్ల. పెద్దలు చెప్పే మంచి విషయాలను గురించి వినడం ఆ మంచిని గురించి ఆలోచించడం ఆ తర్వాత కార్యరూపంలో ఆచరించి చూపడం  దీనివల్ల సమాజంలో  నీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి  నీ ఇష్టం వచ్చినట్టు నీవు ఆలోచించి  నీ వయసులో ఉన్నవారు తెలిసీ తెలియక చెప్పిన విషయాలను మననం  చేసుకుంటూ చెడు మార్గాలకు అలవాటు పడే స్థితిని తప్పించడం కోసం నీతి సూక్తులను వినమంటారు.  పెద్దలు చెప్పిన  భారత రామాయణాది కథలను  వినాలి  నీకన్నా పెద్ద వయసులో ఉన్న  వారు ఎంతో అనుభవంతో చెప్పిన ప్రతి వాక్యాన్ని విని తీరాలి  అప్పుడు మంచి అలవాట్లు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. పెద్దవారు చెబుతున్నప్పుడు సామాన్యంగా చిన్నవారికి కొంచెం విసుగు కలుగుతుంది  ఈయన నాకు చెప్పడం ఏమిటి ఆయన ఏమైనా పెద్దగా చదువుకున్నాడా  నేను చదువుకుంటున్నాను నాకే ఎక్కువ తెలుసు అన్న అహం ఉంటుంది  అయితే పెద్దలు చెప్పిన ఒకటికి రెండుసార్లు  మంచి మాటలు విన్నప్పుడు దానిలో అర్థం  తెలిసి అలా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది అన్న అభిప్రాయంతో  పెద్దల మాట సద్ది మూట  వారు చెప్పిన ప్రతి అక్షరం  ఆచరణీయమే  అన్న విషయం ఈ కుర్రవాడికి ఎప్పుడు తెలుస్తుంది  ఒకే విషయాన్ని రెండు మూడు సార్లు ఆ పెద్దాయన చెప్పినప్పుడు దానిలో ఉన్నటువంటి విషయం  తన మస్తిష్కానికి పడుతుంది అలా మంచి బాలుడుగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది అంటాడు వేమన  ఒకసారి ఆ పద్యాన్ని చదవండి.
"శ్రవణపుటములున్న స్వార్థక్యమేమి రా  వినగవలయు పెద్దలన్నటివన్నీ వినగ వినగ నీకె విశదంబులౌ సుమ్ము..."కామెంట్‌లు