జాతస్యహి ధ్రువో మృత్యువు పుట్టిన ప్రతి జీవి మరణించి తీరవలసినదే ఎవరైనా ఒక వస్తువును తయారు చేసినప్పుడు ఫలానా తేదీన ఇది తయారు కాబడినది ఫలానా తేదీతో దీని అంత్య దశ వస్తున్నది అని ఆ తేదీని ప్రచురించడం ఆనవాయితి. అలాగే భగవంతుడు కూడా మనిషిని తయారుచేసిన వస్తువుగా భావించినట్లయితే ఆ వస్తువు ఏ తేదీన ఈ భూమి మీదకు వచ్చింది తిరిగి ఏ తేదీన ఈ భూమిని విడిచి మా దగ్గరకు వస్తుంది అన్న వివరాలను అన్నిటినీ ముఖం మీద వ్రాస్తాడు ఇది బ్రహ్మ రాత అని హిందువులు అందరూ నమ్మే విషయం. నిజం కూడా అంతే కదా ఈ భూమి మీద ఏ ప్రాణి చెట్టు పుట్ట పక్షి ఏది జన్మించినా అది శాశ్వతంగా ఉంటుందా ఏదో క్షణాన మరణించి తీరుతుంది ఇది కాలపు ప్రభావం మానవుని చేతిలో లేదు అన్నది స్పష్టం. ఒక బిడ్డ జననానికి కారణం ఎవరు వేద విహితము వేద రహితము అన్న సిద్ధాంతాన్ని నమ్మితే భౌతికంగా మనం చూస్తున్న విషయం గమనిస్తూ మన శాస్త్రజ్ఞులు చెప్పిన విషయం స్త్రీ పురుషుల సంగమం వలన బిడ్డ జన్మ ప్రారంభమవుతుంది ఒక్కొక్క నెల ఒక్కొక్క విధంగా ఆ బిడ్డ పెరుగుతూ తల్లి గర్భంలో ఒకసారి చర్మాన్ని మరొకసారి ఎముకలను మరికొంత కాలం తర్వాత గుండెను చివరికి బుద్ధిని అంటే మెదడును పొంది పూర్తి స్వరూపం ఆకారంగా వచ్చిన తరువాత ఆ మానవ జన్మ తల్లి గర్భం నుంచి ఈ భూమి మీదకు వస్తున్నది దానిలో నీ ప్రమేయం ఉన్నదా కావాలని ఈ తల్లి గర్భంలోనే ఉండాలని నీవు ఎప్పుడైనా కోరుకున్నావా నీ చేతిలో లేని విషయానికి నీవెలా కర్తవవుతావు. కనక ఆ కర్తవు నీవు కాదు.
మానవుడు మరణించిన తరువాత అతను ఎన్ని సంవత్సరాల ఎన్ని నెలల ఎన్ని రోజులు జీవించాలో ఆ గడువు దాటిన మరుక్షణం అతని ఆయువు తీరినట్లు లెక్క అతని శ్వాస ఆగి గాలిలో కలిసిపోతుంది ఆ స్థితిని కలుగజేస్తున్నది నీవా అది నీ చేతిలో ఉన్నదా ఒకవేళ బలవంతంగా చనిపోతే దానిని ఆత్మహత్య అంటారు తప్ప మరణము అనరు కనుక అది కూడా నీ చేతిలో లేదు జనన మరణాలే నీ చేతిలో లేనప్పుడు ఈ భూమి మీద తిరిగి ఆడిన ప్రతిరోజు నీ సొంతం అని చెప్పుకోవడానికి నీకు ఏమైనా అధికారం ఉన్నదా అని అడుగుతున్నాడు వేమన. ఎంతమంది మనుషుల మనస్తత్వాలను ఆయన అధ్యయనం చేసి ఉండకపోతే అంత లోతైన అర్థాలను మనకు చెప్పగలుగుతాడు అని ఆలోచించినట్లయితే వారు చెప్పిన ప్రతి వాక్యం శిరోధార్యం. పచ్చి నిజాలే తప్ప అబద్ధాలు చెప్పరు ఆ పద్యాన్ని చదివితే మీకే అర్థమవుతుంది.
"జనన మరణములకు దా స్వతంత్రుడు గాడు మొదట గర్త కాడు తుదను కాడు నడుమగర్త ననుట నగుబాటు కాదొకో..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి