అందమైన మనస్సుంది
చూడరావ ఒక్కసారి/
ప్రియమార మాటలనే
చెప్పరావ ఒక్కసారి//
కనులు తెరిచి కలలుకంటు
నన్నునేను మరిచానూ/
రెప్పదాటి కనులముందు
కానరావ ఒక్కసారి//
మౌనముగా ఊసులన్నీ
మల్లెలు గా తురిమినాను/
గుండెలోని గుబులంతా
తీర్చరావ ఒక్కసారి//
తీపికబురు చెప్పాలను
తలపులతో తడిచానూ/
మకరందపు పలుకులనే
వినగరావ ఒక్కసారి//
పువ్వులాగ నా మనసే
నింపుకొనే పరిమళాలు/
వదిలిపోని తూనీగల
చేరరావ ఒక్కసారి//
కలనైనా ఇలనైనా
మనలోకము పూలవనం/
హాయిగొలుపు వీచికలా
చుట్టరావ ఒక్కసారి//
జతకలిసే క్షణమునకై
చకోరమై వేచినాను/
ప్రేమమీర లతాశ్రీని
పిలవరావ ఒక్కసారి//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి