శ్రీశివ పార్వతుల దివ్య మంగళ స్వరూపము-- శంకరప్రియ., శీల.,--సంచారవాణి: 99127 67098
 🙏శ్రీఉమా మహేశ్వర!
శివా! శ్వేత పింగళా!
     నమస్సులు జగత్పిత!
శ్రీసాంబ! సదాశివ!
🙏శివ! జగ దభయంకర!
హర! ప్రవర! ప్రియంకర!
     నమస్సులు శివంకర!
శ్రీసాంబ! సదాశివ!
        ( శ్రీ సాంబశివ పదాలు., శంకర ప్రియ.,)
👌శ్రీశివ పార్వతులు..  సకల ప్రాణికోటికి.. ఆది దంపతులు !! ఈ చరాచర ప్రపంచము నకు తల్లి దండ్రులు! గృహస్థు లందరికీ ప్రాతః స్మరణీయులు!
       పరమ శివుడు.. అర్థ నారీశ్వరుడు.. అనగా,  కుడివైపున శుద్ధమైన "శ్వేత వర్ణము"తో శివ స్వరూపము; ఎడమవైపున బంగారువంటి "పింగళ వర్ణము"తో పార్వతీ స్వరూపము.. కలిగి యున్నాడు! కనుక, "శ్వేత పింగళ" నామధేయుడైనాడు!
 👍మహాప్రసాదో దమనః!
 శత్రుహా "శ్వేత పింగళ:!" అని;
శ్రీమహా భారతాంర్గత మైన "శ్రీ శివసహస్ర రహస్యనామ స్తోత్రము.. 888వ. నామము" నందు ప్రస్తుత్తించారు, శ్రీకృష్ణ పరమాత్మ!
👌సపరివార సమేతుడైన సాంబశివుని యొక్క సాకార స్వరూపమును.. మనమహర్షులు ఈ విధముగా దర్శించారు!
     శ్రీసాంబశివ పరం బ్రహ్మమునకు.. వామభాగము నందు.. మహాశక్తి స్వరూపిణి యైన పార్వతీ మాత.. దక్షిణభాగము నందు.. మహా గణపతియైన, వినాయకుడు.. జగదంబ వొడిలోన మహా సేనాపతియైన కుమారస్వామి.. విలసిల్లు చున్నారు! 
 👌శ్రీశివ పార్వతుల దివ్యమంగళ స్వరూపమును.. గృహస్థులమైన మనమంతా దర్శించాలి! కనుక, మన గృహంలోను, పూజా మందిర మందును.. "శ్రీస్వామివారి చిత్రపటమును" పెట్టుకొని; భక్తి ప్రపత్తులతో రెండుచేతులను జోడిoచి నమస్కరించాలి!
    🙏ఓం నమః శివాయై! నమః శివాయ!!
        🚩ఆట వెలది
🙏కూరుచుండి శివుడు గౌరీ సమేతుడై
      కార్తికేయు డంబ కరమునందు 
       విఘ్నరాజు తోడ విశ్వేశు వొడిలోన 
       శ్వేతగిరి నివాస! శివభవేశ!
      ("శతావధాని" ఉప్పలధడియం భరత్ శర్మ., శివభవేశ శతకం.,)

కామెంట్‌లు
చాల బాగున్నది శంకరప్రియగారు అభినందనలి
చాల బాగున్నది శంకరప్రియ గారూ అభినందనలు