పదకవితా పితామహుడు; -:డా.రామక కృష్ణమూర్తి ; సెల్ ; :9948285353

 పదకవితల పారాయణంతో
ఏడుకొండల స్వామిని వేడుకతో
మది కోవెలగా చేసికొని
అర్చించిన వాగ్గేయకారికత్వం
అహరహము పునీతమై
నిరతము గానమాధుర్యమై
ప్రకాశించిన నారాయణుని 
తిరునక్షత్రము తానై,
లాలిజోలల పవ్వళింపు సేవలు
సుప్రభాత సుమమంగళానుశాసనమై
కీర్తిగడించిన భాగవతుడు.
ముప్పది రెండు వేల సంకీర్తనా
పుష్పాలతో సప్తగిరీశుని సేవించి,ముక్తినందిన మోక్షజీవి.
తెలుగువారి ఆధ్యాత్మిక అనుదిన కర్ణనివాసి.
x
కామెంట్‌లు