రౌద్రం-రుధిరం-రణం; -:డా.రామక కృష్ణమూర్తి- బోయినపల్లి,మేడ్చల్.- 9948285353

"జైహింద్" నినాదంతో ముందుండి నడిచి,
దేశస్వాతంత్ర్యానికి ఊపిరులూది,
"ఆజాద్ హింద్ ఫౌజ్" ను స్థాపించి,
బ్రిటీష్ వారికి సింహస్వప్నమైనాడు.
నేతాజీ తానై సమరానికి సారథ్యం వహించాడు.
యుద్ధవిద్యలను విస్తృతం చేసి,
ఆంగ్లేయులకు సవాల్ విసిరాడు.
రుధిరాన్ని ఇమ్మని అడిగి,
స్వేచ్ఛను కానుకగా ఇస్తానన్నాడు.
దేశమాత సంకెళ్ళను తెగద్రుంపి,
వందేమాతర స్ఫూర్తికి ఆజ్యమయ్యాడు.
దేశప్రజల ఐక్యతకు,
సాయుధపోరాటమే శరణ్యమని,
సాహసమే ఆయుధమని,
చండ్రకిరణాలను ప్రసరించాడు.
గగనవీధిలో గానమై అదృశ్యమైనాడు.

కామెంట్‌లు