గణతంత్రవేడుక ,(మణి పూసలు); - మిట్టపల్లి పరశురాములు సిద్దిపేట ,చరవాణి:9949144820
భరతమాత మాదుయమ్మ 
వందనమ్ము జేతుమమ్మ 
అమరవీర జవానులకు 
దండ మెపుడుజేతుమమ్మ

అమరుల త్యాగ ఫలము
దేశభక్తి నిండుదనము
వచ్చె నిదిగొస్వేచ్ఛమనకు
కలిగించె జనులకుముదము

శాంతిమనకునిలుపుచుండ
పావురాయిఎగురుచుండ
కలతలసలులేనిస్వేచ్ఛ
సమతమమతనిచ్చుచుండ

మతములన్ని ఒకటనియు
మనుషులంత సమానమనియు
చాటిచెప్పినిలచెస్వేచ్ఛ
కలసిమెలసియుండుమనియు

తెల్లవారినెదిరించెను
నల్లవారినాదరించెను 
తెలుపునలుపులున్నగాని 
అందరినిఆదరించెను

భారతీయ జాతిమురువ
సిరులపంటలెన్నొకురువ
అందజేసెమనకుస్వేచ్ఛ
జైభీమ్ రాజ్యాంగవిలువ
             *


కామెంట్‌లు