న్యాయాలు -26
కంబళ భోజన న్యాయము
*****
కంబళి అంటే గొంగళి లేదా గొంగడి. గొంగడిలో కూర్చుని భోజనం చేస్తూ వెంట్రుకలు వస్తున్నాయని బాధ పడటం లేదా వెంట్రుకలు ఏరడాన్ని కంబళ భోజన న్యాయము అంటారు.
కంబళి లేదా గొంగళిని గొర్రెల వెంట్రుకలతో తయారు చేస్తారు. వాటి వెంట్రుకలు పొడవు తక్కువగా ఉండటం వల్ల భోజనం చేసేటప్పుడు ఏ కొంచెం గాలి వీచినా, కదిలినా మనకు తెలియకుండానే వెంట్రుకలు తినే భోజనంలో పడే అవకాశం ఉంది.
దీనినే సామెతగా "గొంగట్లో తింటూ వెంట్రుకలను ఏరుకున్నట్లుంది" అంటుంటారు.
ఈ న్యాయమును ఎక్కువగా వ్యవస్థ, సమాజం గురించి చర్చించేటప్పుడు వాడుతూ ఉంటారు.
ఈవ్యవస్థలో,సమాజంలో అందరమూ భాగస్వాములమని తెలుసు .కానీ దాన్ని మార్చేంత శక్తి లేనప్పుడు ,పరిస్థితులు చెయ్యిజారి పోయినప్పుడు వ్యవస్థ బ్రష్టు పట్టిపోయిందనీ,సమాజం మునుపటిలా లేదని పడే బాధను ఈ కంబళ భోజన న్యాయమునకు సరైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి