సుప్రభాత కవిత ; -బృంద
తెలివెన్నెల తొలివెలుగులో
కలిసిపోయే వేళ

పోగేసిన నీరు కురిపించి
మబ్బులు సాగిపోయే వేళ

జ్ఞాపకాల జడిలో తడిసి
తలపులు ఆరబెట్టుకునే వేళ

అందమే సుమగంధమై
అంతరంగాన్ని అలరించేవేళ

కనుపాపలు కలవరించే
కమ్మని కల తీరే వేళ

మురిపించే మందారాల
మౌన సంగీతమూ...

చిలిపిగ తలలూపే
చేమంతుల  సయ్యాటలూ

ముద్దుగా బంతిలా విరిసిన
ముద్దబంతుల  ముచ్చటలూ

మనసుదోచే సంపెంగల
మోహనమైన సరాగాలు

చుక్కల్లా విచ్చిన మల్లెల
మధురమైన  పరిమళాలు

ఈ చక్కని దృశ్యపు సొగసు
చూసి మది  నింపుకునే గుణము

అందమైన సృష్టిలో అందాలన్నీ
అడగకనే దివి ఇచ్చిన వరాలు

నందనమైన అంతరంగాన
తొణికే మకరందపు చినుకులు

అనిర్వచనీయమైన హాయైన వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు