మానవతను రుజువుచేసేవి
దానధర్మాలే... !
దయతో...దీనులకుచేసే దానం
దైవారాధన సమమే... !
దానగుణానికి పేద - గొప్ప...
తారతమ్యా లుండవు !
గొప్పవాళ్లందరూ....
దీనులకు దానం చేస్తారా... !
యే కొందరో.... కదా... !!
యాచన అంటే......
విశ్లేషించలేని దైన్యమే...
వారి మనోవేదన ...
ఇంకొక యాచకునికే...
బాగాతెలుస్తుంది... !
అందుకు తార్కాణమే...
ఈ చిత్రం... !
తానూ ఒక యాచకుడే ఐనా
మరోయాచకుని దీనత్వాన్ని
చూసినంతనే మనసుకరిగి
తనబొచ్చెలోని చిల్లరలో
కొంత ధర్మం చేస్తూ...
తనలోని మానవతను
నిరూపించుకుంటున్నాడు!
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి