1. మీనమేషాలు-మంచి చెడ్డలు లెక్కించడం. (అత్యవసర పరిస్థితుల్లో చేయాల్సిన పనులకు జ్యోతి శాస్త్రాన్ని అనుసరించి, రాసులు, లగ్నాలే ప్రధానంగా చూచుకుంటుంటే, కార్యం సఫలం కాదు.)
2. వాతాపి జీర్ణం-తినే వస్తువు ఎటువంటిదైనా శరీరానికి హాని లేకుండా జీర్ణం అయ్యేందుకు వినియోగించే జాతీయం. పూర్వం వాతాపి అనే రాక్షసుడు అగస్త్య మహర్షిని కడుపులో జీర్ణమై పోయాడని రామాయణంలో ఒక కథ ఉంది.
3. హృదయ శల్యం-మనసును తీవ్రంగా గాయపరిచే పెళుసు మాట.
4. ఆషాడభూతి-నమ్మించి మోసగించే శిష్యుడు.
5-కుంభకోణం-పెద్ద ఎత్తున జరిగే మోసం. (ఒకప్పుడు కుంభకోణం క్షేత్రంలో పెద్ద ఎత్తున దగా జరిగిందని, అందువల్ల పెద్దవైన మోసాలను కుంభకోణంగా చెప్పే జాతీయం ఏర్పడిందని చెబుతారు).
6. విశ్వామిత్ర సృష్టి-త్రిశంకుని కోసం సృష్టికి ప్రతి సృష్టి చేసినవాడు-విశ్వామిత్రుడు. అందువల్ల ప్రకృతి విరుద్ధమైన కార్యక్రమాలను విశ్వామిత్ర సృష్టిగా వ్యవహరిస్తున్నారు.
సంస్కృత జాతీయాలు.;-తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి