ప్రశాంతంగా
మౌనంగా
ఉండటం
నిజానికంత తేలిక కాదు
కఠినమైన పని
ఆలోచనలు
వెనువెంట వస్తూ ఉంటాయి
వస్తే రానివ్వండి...
మేఘాలు
వస్తాయి...పోతాయి
అలాగే
ఆలోచనలూ
దానికిష్టమొచ్చినట్లు వస్తాయి
కనుక
ఆలోచనలు
ఎప్పుడొస్తే అప్పుడే రానివ్వండి
మీరు
వొట్టి ఖాళీ కుండలా ఉండండి
అప్పుడు
ఆలోచనలు లోపలికి వస్తాయి
పోతాయి
నెమ్మది నెమ్మదిగా
ఆలోచనలు
రావడం పోవడం
మిమ్మల్ని ఇబ్బందిపెట్టవు
ఎప్పుడైతే
మీరు
ఆలోచనల రాకపోకలను
పట్టించుకోకుండా
ఉండటాన్ని అలవాటు చేసుకుంటారో
అవి, వాటంతటవి
మెల్లమెల్లగా ఆవిరైపోతాయి
కనిపించకుండాపోతాయి
ఆలోచనలు చాటుమాటై
అదృశ్యమవడం
మీ ప్రయత్నం వల్ల కాదు
ప్రశాంతంగా
నిశ్చలంగా
ఖాళీగా ఉండటంవల్లే సుమీ
అంటాడు ఓషో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి