బాలికలదినోత్సవ....
శుభాకాంక్షలతో 🎻
💐💐💐💐💐💐
జగములనేలే ఏలిక ఈమె...
భువిపై బాలికగా అవతరించె,
శ్రీలక్ష్మిని తనవెంటదెస్తు సిరి-
సంపద లొసఁగఁగా ఆడపిల్లయై తాను యే ఇంటనబుట్టునో...
వారిదె కద అదృష్టము !!
సిరిమువ్వల సంగీతం, తప్ప టడుగునాట్యాలు,ముద్దులొలుకు,వేదమంత్రాల పలుకులు... !
సిరులను కురిపించే ఆ బోసి నవ్వులు....!
చదువులలో సరస్వతి...
పనులన్నింటా ఆమె సాక్షాత్తు
పార్వతి.... !!
నేటి చిట్టిపాపాయె...చెల్లియై,
అక్కయై, వదినయై, ఆలియై,
అమ్మయై, అత్తయై.... జగతికి మూలము... సర్వము తానే... యగుచున్నది !
వామన రూపిగ బట్టిన...
త్రివిక్రమ స్వరూపిణి... !!
. ఆడపిల్లను అపురూపంగా...
చూసుకున్న ఇల్లే స్వర్గం !
ఆమె కంట తడి వచ్చిందో
ఆ ఇల్లే... నరకం !!
********
విక్రమ స్వరూపిణి @-. కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి