ఆడుకొందాం!(బాలగేయం );-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 ఆకాశానికి నిచ్చెన వేద్దాం!
ఆశల పల్లకి మోసుకెళ్దాం!
ఆడంబరంగా అడుగులు వేద్దాం!
ఆ జాబిలినే పట్టుకొందాం!
ఆటల నాడుతు నూగి పోదాం!
ఆ మబ్బుల్లో గూడు కడదాం!
ఆకాంక్షలన్నీ తీర్చుకొందాం!
ఆ నక్షత్రాలను మూటకడదాం!
ఆహా!అంటూ ధరణికి వద్దాం!
ఆనందంగా  పంచి పెడదాం!
ఆ ముచ్చట్లే అమ్మకు చెబుదాం!
ఆ తల్లి యొడిలో నిద్దుర పోదాం!
-----------------------------


కామెంట్‌లు