సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -6
అంధ కూప న్యాయము
  ******
అంధ అంటే గుడ్డితనము. కూపము అంటే బావి.
అంధులైన వ్యక్తులు వరుసగా వెళ్తున్న సమయంలో ముందున్న అంధుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోతాడు. అది మిగిలిన గుడ్డి వాళ్ళు  తమ అంధత్వం వలన గమనించలేరు. వాళ్ళూ వరుసగా అందులో పడిపోతారు.
 
ఇలా తమ అంధత్వం వలన  వాళ్ళు పడిపోయిన తీరును అంధ కూప న్యాయమనీ,అంధ పరంపరా న్యాయమనీ,అంధ కూప పతన న్యాయమని అంటారు.
సమాజంలో కొందరుంటారు.వాళ్ళకు కళ్ళు ఉన్నా అజ్ఞానంతో చాలా అవివేకంతో  ప్రవర్తిస్తూ  ఉంటారు. ఒకరిని చూసి మిగతా వారు" అది మంచా? చెడా?ఎందుకు? ఏమిటి?ఎలా? "అనే ఆలోచన చేయకుండా  అనుసరిస్తూ ఉంటారు..
అలాంటి వాళ్ళను 'గొర్రెల మంద/ గొర్రెదాటు వ్యవహారం అని కూడా అంటారు.అంటే ముందు గొర్రె ఎలా వెళితే మిగతావి కూడా అలాగే వెళ్తాయి.ఒకటి ఏదైనా ప్రమాదంలో పడిపోతే మిగిలినవి కూడా అలాగే పడిపోతాయి.
ఇలా మూకుమ్మడిగా ఒకే పొరపాట్లు చేసే అవివేకులకు,అజ్ఞానులకు  ఈ న్యాయమును వర్తింప జేసి ఉదాహరణగా చెబుతుంటారు.
ఇలాంటి వారినే చిట్టీల పేరుతోనో లేదా ఉద్యోగాల పేరుతోనే బురిడీ కొట్టించి లక్షలు కోట్లు మోసం చేయడం అప్పుడప్పుడూ వింటూ ఉంటాం . కాబట్టి దేనికైనా వివేచన అవసరమని గుర్తించాలి. 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం