న్యాయాలు-22
ఊసర బీజ న్యాయము
*****
ఊసరము అంటే చౌటి నేల లేదా చవిటి పర్ర లేదా చౌడు భూమి అంటారు.
ఈ చవిటి భూమిలో నాటిన విత్తనము సరిగా మొలకెత్తదు. ఒకవేళ మొలకెత్తినా భూమి సారవంతంగా ఉండక పోవడం వల్ల ఆ మొక్కలో సరైన ఎదుగుదల ఉండదు. రకరకాల తెగుళ్ళు,చీడ పీడలు తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. విత్తనం ఎంత ఆరోగ్యవంతమైది అయినా అది పెరిగేందుకు సరైన నేల లేక పోతే ఆ విత్తనానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు.
అలాంటి సందర్భంలో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
పిల్లలంతా సమానమైన తెలివితేటలతో పుడతారని మనస్తత్వ శాస్త్రం చెబుతుంది.అయితే అలాంటి పిల్లలకు సరైన కుటుంబ, విద్యా వాతావరణం , చక్కని బోధన, మంచి ప్రేరణ అందించగలిగితే వారిని ఎంతో ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులు రేపటి పౌరులు తయారు అవుతారు.
అలాంటి పరిసరాలు పరిస్థితులు సరిగా లేని వారు ఊసర బీజాలవడం జరుగుతుంది.అలాంటి వారికి ఈ ఊసర బీజ న్యాయమును ఉదాహరణగా చెప్పవచ్చు.
అందుకే పిలలను కనడమే కాదు వారి సర్వతోముఖాభివృద్ధికి తల్లిదండ్రులు, గురువులు,సమాజం సరైన పరిస్థితులను కల్పించాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి