"ఏమండీ!పిల్లకి మంచి సంబంధం చూడండి "రోజూ పోరుతుంది భార్య. ఆయన చెప్పులు అరిగేలా తిరిగితే రెండు సంబంధాలు వచ్చాయి.ఒకపిల్లాడు కంపెనీలో పని.ప్రస్తుతానికి జీతం కారు అన్నీ బాగున్నాయి. రెండో అతను బాగా చదువుకున్న మంచి పండితుడు. రేడియోలో టి.వి.లో ఉపన్యాసాలు ఇస్తాడు.ఒక బడి నడుపుతున్నాడు.జనాలు జేజేలు కొడుతున్నారు. భార్య అంది"కంపెనీ కుర్రాడికి విదేశాలకు వెళ్ళే ఛాన్స్ మంచి జాబ్! అమ్మాయిని అతనికి ఇద్దాం". కానీ భర్త మాత్రం రెండో అతను ఐతేనే పిల్ల సుఖపడుతుంది.సొంత ఇల్లు మంచి అలవాట్లున్నవాడు.ఈకంపెనీ ఉద్యోగాలు తుమ్మితే ఊడే ముక్కులు.జీతాలు బాగున్నా దర్జాగా బతికి ఆర్ధిక మాంద్యం వస్తే తీసేస్తారు.వారి బతుకు ప్రశ్నార్థకంగా మారుతుంది. దర్జాలకుపోయి ఖర్చు పెడ్తారు.విద్వాన్ సర్వత్రపూజ్యతే! చదువు పాండిత్యం ఎక్కడకెళ్లినా గౌరవం మర్యాద తెస్తుంది " అన్న తండ్రి మాటలతో కూతురు ఏకీభవించింది.ఇతనినే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది🌹
సర్వత్రపూజ్యతే! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి