ఆ కాలంలో మనం తిన్న దెబ్బల జాబితా చాంతాడంత. ఒకటా రెండా....దెబ్బ మీద దెబ్బ!! ప్రతిదానికీ దెబ్బతినాల్సిందే!!
ఈ కాలంనాటి పిల్లలకు అప్పట్లో మేం తిన్న దెబ్బలు చెప్తుంటే ఆశ్చర్యం అన్పించొచ్చు.
ఆసలు ఈనాటి పిల్లలు ఆరోజల్లో మేం తిన్న దెబ్బలకు కారణాలు వినే ఉండరు. అందుకే ఒక్కసారి ఆ దెబ్బల జాబితా లోకెళ్దాం...
దెబ్బలు తిని చాలా సేపు ఏడిస్తే మళ్ళీ ఇంకొక దెబ్బ!
దెబ్బ తిని లోలోపల మూలుగుతే నీకింత నిబ్బరమా అని ఓ దెబ్బ!
దెబ్బ పడకుండానే ఏడిస్తే ఏంటీ నటన అని ఓ దెబ్బ.
పెద్దవాళ్ళు కూర్చున్న చోట వాళ్ళు వెళ్ళిపోయాక అదే చోట నిలబడితే ఓ దెబ్బ అలా నిలబడొచ్చాని!
పెద్దవాళ్ళు నిల్చున్నప్పుడు అక్కడ కూర్చుంటే ఓ దెబ్బ!
పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళ మధ్య అడ్డదిడ్డంగా నడిస్తే ఓ దెబ్బ!
అతిథులకోసం వండింది వారికి పెట్టకముందే తింటే దెబ్బ!
పళ్ళెంలో అన్నం పెట్టిక తిననని మొండీకేస్తే ఓ దెబ్బ!
సూర్యుడు అస్తమించాక ఇంటికి ఆలస్యంగా వెళ్తే ఎక్కడ తిరిగొస్తున్నావని ఓ దెబ్బ!
పక్కింట్లో తినొస్తే దెబ్బ!
ఎప్పుడు చూడూ ఆ రుసరుసలేంటీ..అద్దంలో చూసుకో నీ మొహం ఎలా ఉందో అని దెబ్బ!
మరీ ఎక్కువగా దూకినా దెబ్బే!
పెద్దవాళ్ళతో గొడవపడితే దెబ్బ!
చిన్న పిల్లలతో గొడవపడి గెలిచానని అరిచినా దెబ్బే!
అతి నెమ్మదిగా అన్నం తిన్నా దెబ్బే!
త్వరత్వరగా నోట్లు కూరుకుతిన్నా దెబ్బ!
చూసిందల్లా కావాలని అడిగితే దెబ్బ!
పళ్ళెంలో పెట్టిందాంట్లో ఒక్క మెతుకు మిగిలినా దెబ్బే!
తిన్న తర్వాత కంచం కడగకపోతే దెబ్బ!
మాట్లాడుతూ తీంటే దెబ్బ!
పెద్దవాళ్ళు లేచాక లేవకుండా పడుకుంటే దెబ్బే!
అతిథులు తింటుండటాన్ని చూస్తే దెబ్బ!
పెద్దవాళ్ళ వంక చిరాకుగా చూస్తే దెబ్బ!
పెద్దవాళ్ళు చెప్పే మాటలను వినకుంటే దెబ్బ! కాదూ కూడదని ఎదురుతిరిగి మాట్లాడితే దెబ్బ!
మిత్రులు వీధిలో ఫుట్ బాల్ ఆడుతున్నప్పుడు వారితో కలిసి ఆడితే దెబ్బ!
మిత్రులు ఆడుతున్నప్పుడు వారితో కలవక ఇంట్లోనే ఉంటేనూ దెబ్బే.!
తిన్న కంచాన్ని సరిగ్గా కడగకుంటే దెబ్బ!
తిన్న కంచం చేజారి కిందపడిని దానికి పొరపాటున కాలు తాకినా దెబ్బే! తిన్న కంచం కడిగిన తర్వాత అదెక్కడ ఉఞచాలో అక్కడ ఉంచకపోతే దెబ్బ!
గోళ్ళను కొరికితే దెబ్బ!
స్నానం చేయకుంటే దెబ్బ!
కాకి స్నానంలా ఒంటిమీద రెండు చెంబుల నీళ్ళు కుమ్మరించుకొస్తే దెబ్బే!
స్కూల్లో సరిగ్గా ప్రవర్తించడం లేదని తెలిస్తే ఇంటి దగ్గర దెబ్బ !
వీధిలో కారు మనకు తాకితే కారు ద్గరకెందుకెళ్ళావని దెబ్బ!!
రోడ్లో నడుస్తున్నప్పుడు ఏదైనా గాయమైతే అంత అజాగ్రత్తా అంటూ దెబ్బ!
అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుంటే దెబ్బ!
పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు అడ్డు తగిలి పెద్దగా మాట్లాడితే దెబ్బ!
ఆలస్యంగా గుడికి వెళ్తే దెబ్బ!
మిత్రుల నుంచి చెప్పులు వంటివి ఫ్రీగా తీసుకుని వేసుకుంటే దెబ్బ!
అమ్మ సెలెక్ట్ చేసిన చొక్కా నచ్చలేదని చెప్తే ఓ దెబ్బ!
దుకాణంలో బట్టలు ఎంపిక చేసే ఆవకాశం ఉండదు. ఒకవేళ ఆ అవకాశం ఉండి లేట్ చేస్తే ఎంతసేపు చూస్తావని దెబ్బ!
టీచరు చెప్పిన దానినే అరకొరగా రాస్తే "ఏమిట్రా నీ సొంత తెలివితేటలు?" అంటూ రెండు దెబ్బలు!
ఇలా ప్రతి దానికీ దెబ్బే....
ఈనాటి పిల్లలకు ఇవన్నీ అతిగానూ అబద్ధంగానూ అన్పించొచ్చు. కానీ దాదాపుగా ఉమ్మడికుటుంబంలో పుట్టి పెరిగిన వారిలో చాలా మంది ఇలా దెబ్బలు తిని ఎదిగిన వారే. అప్పట్లో దెబ్బలు తినడం ఆనేది దినచర్యలో భాగమే. అయితే ఆ దెబ్బలు మంచిగా ఎదిగేందుకు దోహదపడ్డాయనే చెప్పాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి