ఇక్కడ చూస్తున్న ఈమె ప్రతి రోజూ ఓ ఫ్యాక్టరీ పక్కనే రాగి జావను అయిదు రూపాయలకే అమ్ముతుంటారు. ఓరోజు ఒకతను ఆమెతో మాటలు కలిపాడు.
అందరూ పది రూపాయలకు అమ్ముతుంటే అయిదు రూపాయలకే ఇస్తున్నావేంటీ అని అడిగాడతను.
అందుకామె చెప్పిన జవాబు అతనిని ఆలోచనలో పడేసింది.
ఆమె రోజూ పది కిలోమీటర్లు సైకిలుని తోసుకొంటూ వస్తారు. పైగా గ్యాస్ స్టవ్ మీద జావ చేస్తే రుచి ఉండదని ఆమె కట్టెల పొయ్యి మీద కుండ పెట్టి జావ తయారు చేస్తారు. మరి ఇంత కష్టపడుతుంటే ఎందుకంత తక్కువ డబ్బుకి అమ్మడమని అడిగితే నా కష్టానికి తగిన డబ్బు లభిస్తోందని, అధిక లాభం అక్కర్లేదని చెప్పారామె. ఆశకూ డబ్బుకీ అంతెక్కడిదని చిన్న నవ్వు నవ్వారామె.
ఆమెకున్న తృప్తి భారీ స్థాయిలో షాపింగ్ మాల్స్ నిర్వహించే వారి మనసులు విప్పారుతాయా అనేది ఆలోచించాల్సిన అంశం కదూ?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి