అనగనగా ఓ ఊళ్ళో ఓ ఉల్లిపాయ, ఒక టొమాటో, ఒక బంగాళదుంప అత్యంత సన్నిహిత మిత్రులు.
ఓరోజు ఆ మూడూ సముద్రస్నానానికి వెళ్ళాయి.
అప్పుడు ఉల్లిపాయ, టొమాటో ఎంత చెప్పినా మాట వినకుండా బంగాళదుంప లోపలికి దొర్లుకుంటూ పోయి నీటిలో మునిగి చనిపోయింది.
టొమాటో, ఉల్లిపాయ విషయం తెలిసి బోరుబోరుమని విలపించాయి. రెండూ తెగ దుఃఖిస్తూ ఇంటికి బయలుదేరాయి.
దారిలో ఓ నీటిలారీ డీకొనడంతో టొమాటో నలిగి అక్కడికక్కడే చనిపోయింది.
అది చూసి ఉల్లిపాయ కన్నీరుమున్నీరైంది.
ఇంటికి చేరుకున్న ఉల్లిపాయ దేవుడి ముందర నిల్చుని రోదించింది.
"మొదట బంగాళదుంప చనిపోతే నేనూ, టొమాటో ఏడ్చాం. టొమాటో చనిపోయినప్పుడు నేను ఏడ్చాను. నేను చనిపోతే నాకోసం ఏడ్చే వారెవరూ లేరు కదా" అని బాధపడింది.
ఉల్లిపాయ మాటలన్నీ విన్న దేవుడు బాధపడ్డాడు.
"అయ్యో ఉల్లిపాయా...నీ మాటలు విని నాకూ బాధ కలుగుతోంది. నువ్వు మరణించినప్పుడల్లా అక్కడే పక్కనున్న వారందరూ ఏడుస్తారు. దిగులుపడకు" అన్నాడు దేవుడు.
దాంతో అప్పటి నుంచేనట...ఉల్లిపాయ తరుగుతున్నప్పుడు తరిగే వారికన్నా పక్కనున్నవారి కళ్ళు కన్నీరు కార్చటం మొదలైందని ఎప్పుడో ఎక్కడో ఓ బామ్మ చెప్పిన కథ ఇది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి