ఆంగ్లం బాల గేయం!!?; - సునీతా -ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా
మాతృభాష
అమ్మలాంటిది!!

అంతర్జాతీయ భాష
నాన్న లాంటిది!!

అమ్మ ఇంటిని చూస్తుంది
నాన్న సంపాదిస్తాడు!!?

డబ్బున్న వాడు
నిన్ను డబ్బు సంపాదించు
అని చెప్పడు!!

ఆంగ్లము వచ్చినవాడు
నిన్ను ఆంగ్లము నేర్చుకో
అని చెప్పడు!!

వానికన్నా నీవు
ఎక్కువగా ఎదగడం
వానికి ఇష్టం ఉండదు!!!?

ఏమీ రాని వాడు
ఏమీ లేని వాడు
దాన్ని గుర్తిస్తాడు!!!?
ఆ రహస్యం తెలుసుకో

ఆంగ్లం సులభంగా నేర్చుకో
సంపదను సులభంగా సంపాదించు!!?

మాతృభాష అమ్మలాంటిది
అంతర్జాతీయ భాష నాన్నా లాంటిది
అమ్మ ఇంటిని చూస్తుంది
నాన్నా సంపాదిస్తాడు!!!

On the occasion of republic day celebration 26th January

కామెంట్‌లు