ప్రియమైన వేణుగానం
విన్న గోపికలా...
పరవశించిన భువనం
మనసుతెలిసిన మమత
విరిసినట్టు...
అరవిచ్చిన ప్రసూనం
మూల మూలా చేరే వెలుగు
స్పర్శకు మేలుకుని
మెరిసే గగనం.
ప్రేమ పంచుతూ జగతిని
అలరిస్తున్న
మలయసమీర గానం
జీవన మధువనంలో
ప్రతిరోజూ వికసించే
అనుభూతుల సుమాలు
వెదజల్లే మకరందాల
ఆస్వాదించే మధూప
బృందాల సవ్వడులే
హృదయ స్పందనలు
మనసంతా వెన్నెల్లా
పరచుకునే ఆనంద
తరంగాలు.
ఉప్పొంగడానికి
ఊహలు చాలవా??
ఇలపైని సోయగాల
కనిపెట్టి కనువిందు
చేసుకుని మురిసే
ముచ్చటైన ఉషోదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి