నేస్తమా -----
నేనిక్కడ ,
నీ పిలుపు కై వేచి వున్నా !
అరే! నీ పిలుపు వినగానే
నా కళ్ళు వర్షిస్తున్నాయెమిటీ ?
మనసు మేఘంలా అలా
తేలిపోతుందేమిటి ......?
గుండె తడిసి..తడిసి
హృదయం బరువుతో
నిండి పోతుందేమిటీ ?
అంతే కాదు ...
నా మోము చిత్రంగా
ప్రకాశ వంతంమైపొయింది!
నా తనువంతా-
ఇంద్రధనస్సు ఐపోయింది,
ప్రియా...మరి నీ రాకతో
ఏమోతానో ..కదా....!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి