శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 సాహనీ అంటే అశ్వసైన్యంకి అధిపతి.అరబిక్ పదం శోభన్ నుంచి పుట్టింది.కర్ణాటకలో12వ శతాబ్దం లో ఉపనామంగా ఉండేది.పంజాబీ సిక్కులు కూడా ఈ పేరు పెట్టుకుంటారు.
భీష్మ సహానీ ప్రసిద్ధుడు.
సాష్టాంగ ప్రణామం అంటే మస్తకం కాలుసేతులుహృదయం కన్నులు తొడలతోపాటు మనసా వాచా నేలపై పడుకొని దైవానికి నమస్కరించటం!ఆడవారు చేయరాదు.
సాధువు అంటే ధార్మిక ఉత్తమ సజ్జనుడు అని అర్థం.సన్మానాలకి సంతోషిస్తూ అవమానం కి కోపం తెచ్చుకోనివాడు సాధువు.గరుడపురాణం ప్రకారం కోపం వచ్చినా కటువుగా మాట్లాడడు.విరక్తుడు.మహానిర్వాణతంత్రంలోఇలా చెప్పబడింది.దృఢసంకల్పం సత్య ధర్మ పరాయణత్వం కలవాడు సాధువు.

కామెంట్‌లు