పర్యావరణ రక్షణే మన ధ్యేయం.! లేదంటే భవిష్యత్తు శూన్యం.!!;--రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త, జేఎన్టీయూహెచ్, హైదరాబాద్.
 ప్రియమైన పర్యావరణహిత మిత్రులారా...!!
ప్రతిరోజు మనము నిత్యవసరాల కోసం, సరుకుల కోసం, కూరగాయల కోసం, మాంసం (మటన్ చికెన్) సూపర్ మార్కెట్ల నుంచి, బజార్ నుంచి, అంగళ్ళ నుంచి, మెడికల్ షాప్స్ మొదలగు వాటి నుంచి తిను బండారాలను, సరుకులను, వస్తువులను తీసుకురావడానికి ఉపయోగించే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ని ఉపయోగించకండి. 
వాటి స్థానంలో వాటి స్థానంలో సరుకులు తీసుకురావడానికి గోనె సంచులు (గన్ని బ్యాగ్స్), బట్ట లేదా గుడ్డ (క్లాత్) సంచులు, టిఫిన్ డబ్బాలు, తిరిగి ఎన్నోసార్లు ఉపయోగించే సంచులు, కాగితపు సంచులు (పేపర్ బ్యాగ్స్), నీళ్లు త్రాగడానికి ప్లాస్టిక్ బాటిల్స్ కాకుండా స్టీల్ బాటిల్స్ ని ఉపయోగించేలా ఆచరిస్తే బాగుంటుంది. పర్యావరణ హితం గోరే స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ ప్రేమికులు పర్యావరణవేత్తలు సూచిస్తున్నటువంటి మరియు ప్రభుత్వము ప్రత్యేకంగా నిర్దేశించిన కాలుష్య రహిత సంచులు, మాంసము (నాన్ వెజ్) తేవడానికి స్టీలు డబ్బాలను ఉపయోగించుదాం. తద్వారా ఫాస్టింగ్ పొల్యూషన్ను మరియు ఘన వ్యర్ధాలు (సాలిడ్ వేస్ట్) కాలుష్యాన్ని (పొల్యూషన్) కంట్రోల్ చేయవచ్చు, చేయగలం. మనకు ప్రకృతి, పర్యావరణ శుభ్రంగా ఉంటుంది. మనతోపాటు అన్ని జీవులు స్వేచ్ఛగా, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంటాయి. ప్లాస్టిక్ మరియు ఘన వ్యర్థాలను కంట్రోల్ చేయడంలో మన వంతు బాధ్యత నిర్వర్తించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా డబ్బులు కూడా ఆదవుతుంది. ఘన వ్యర్థాలను తక్కువ చేసి పర్యావరణ సమతుల్యతలో, గాలి, నీరు, మరియు భూమి (పర్యావరణ) కాలుష్యం (పొల్యూషన్) నుంచి ప్రకృతిని కాపాడిన వాళ్ళము అవుతాము.
ప్రయత్నం ఒకటే దీనికి మార్గం గట్టిగా మనసులో అనుకొని, ఏదైతే అనుకున్నామో దాన్ని ఖచ్చితంగా పాటిస్తే సరిపోతుంది. లేదంటే మనము అనారోగ్యం పాలు కావడమే కాకుండా మన పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి పర్యావరణాన్ని రాబోయే తరాలకు ఇవ్వలేము. వాళ్ల భవిష్యత్తును మనమే కాల రాసిన వాళ్ళం అవుతాం.
దయచేసి ఆలోచించండి..! దైనందిన జీవితంలో మనం ప్రతిరోజు సరుకుల తేవడానికి ఉపయోగించే, వాడే ప్లాస్టిక్ సంచుల స్థానంలో పర్యావరణహిత సంచులను, స్టీలు గిన్నెలను, స్టీలు డబ్బాలను, స్టీలు పాత్రలను, గాజు పాత్రలను మాత్రమే ఉపయోగించుదాం. పర్యావరణ రక్షణే మన ధ్యేయంగా మెదుల్దాం,మనము ఇది కూడా ఒక మన ప్రాథమిక విధిగా (కర్తవ్యం) (Article 51A,G Fundamental Duty) గా భావిద్దాం... ఆచరిద్దాం... సంతోషంగా జీవిద్దాం...


కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం