లెక్కలసార్ సిలబస్ ఐపోయింది కాబట్టి ఓచిన్న చిక్కుప్రశ్న అడిగాడు. "పిల్లలూ!మీఅందరికీ ఎన్ని ఎక్కాలు వచ్చు?" "సార్! నాకు 15ఎక్కాలు బాగా వచ్చు.""నాకు 20దాకా వచ్చు" "ఎక్కం అంటే బెంచీ ఎక్కమని అంటున్నారా? మేము ఎక్కం" ఓకొంటెకోణంగి చిలిపిప్రశ్న!"అరే! ఎక్కాలు అంటే టేబుల్స్!బల్లలు కాదురా బాబూ!" ఏటేబుల్ లో గమ్మత్తు ఉంది?" సార్ మాటలకి అంతా ఆలోచనలో పడ్డారు.రెండో ఎక్కంనించి పదో ఎక్కందాకా నోటితో చెప్పించాడుసార్.కానీ తమాషా తొమ్మిదోఎక్కం గమ్మత్తు ఎవరికీ తెలీలేదు."సరే తొమ్మిదో ఎక్కం హరీ మొదలుపెట్టు" తొమ్మిది ఒకట్ల తొమ్మిది తొమ్మిది రెళ్ళు పద్ధెనిమిది. "శివా అందుకున్నాడు "9×3=27 9×4=36" సార్ ప్రశ్నించాడు "మరి9×9?" ఎనబై ఒకటి..పిల్లలంతా పొలోమని అరిచారు. 9×2=18 కదా?1+8=9 అలాగే 9×3=27 2+7=9 ఇలా ఆఎక్కం హెచ్చవేసి వచ్చిన దాన్ని కూడండి .9అనే వస్తుంది. ఇంక ఏ ఎక్కంకి ఇలారాదు. ఇదీ 9వ ఎక్కం గొప్పతనం" సార్ వివరణ తో పిల్లలు అంతా చప్పట్లు కొట్టారు. 🌹
తొమ్మిదో ఎక్కం! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి