భగవంతుడి సాక్షాత్కారం కోరి
ఒంటికాలిపై నిలబడ్డ మునుల్లా
తపోదీక్షలో ఉన్నట్టున్న
తరూశ్రేణులూ.....
లేతవెలుగులు తగిలీ తగలగానే
పులకరించిన ఏటి నీరు
ప్రేమనంతా కిరణాల్లో నింపి
ఎదలోతులు స్పర్శించే బింబం
వికసించి చూచు సుమబృందాలు
వెదజల్లే మధుర మకరందాలు..
మధువొలికే మధువనాలు
పరిమళించే మాధవీలతలు
ఆవరించిన ఆనందాలు
ఉషోదయ సౌందర్యాలు
తూరుపు కొండల నడుమ
మెరిసే మేలుజాతి రత్నం
జలజలా పాఱే నీటి సవ్వడులు
మంద్రంగా వినిపించే వేదనాదాలు
పొగమంచే ధూపంగా
హారతి పడుతున్న ధరిత్రి
పండుగలా వచ్చే ఉదయానికై
నిండుమనసుతో హృదయం చెప్పే
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి