మిశ్రగతి-అంత్యప్రాస -గజల్ ;- చంద్రకళ యలమర్తి

సముద్రునీ తీరంలో  ఘోషనీకు 
అనిపిస్తుందా
విసురుగాను వీచుగాలి లోనిలకడ
కనిపిస్తుందా

అక్షరాలు పేర్చినేను  అందమైన కవితలె అల్లితి 
పాడకుంటె ఏపాటా నీచెవులకు
వినిపిస్తుందా 

నేలలోన చిగురించే మొక్కలవే పెరగలేవుగా 
మాలి నీరు ఇవ్వకుండ  వృక్షమైఅది చిగురిస్తుందా

చీకటైన యుద్ధములో సిపాయిలే నడవకుంటేను
దిక్కులేని బ్రతుకుల్లో ప్రాణమింక 
మిగలనిస్తుందా 

న్యాయమంటె కనుసన్నల మసలదులే వినుఓచంద్రా
ఛిద్ర మైన బతుకుల్లో వెన్నెలయే 
వికసిస్తుందా

**

కామెంట్‌లు