వేకువ లోని వెన్నెల
మరకలు తుడిపేసి
వెచ్చని ఆశల ఊటలు
మదిలో వంపేసి
చీకట్లో చిన్న బోయిన
కన్నుల కాంతులు నింపేసి
త్రోవలో బాధించే అడ్డంకుల
ముళ్ళు తీసేసి
ఎదురొచ్చే కష్టాల కూటమిని
పక్కకు తోసేసి
అతిశయాలు ఆడంబరాలు
అనవసరమని నెట్టేసి
కొత్త కొత్త గొంతెమ్మ కోరికలు
చివురించకుండా తుంపేసి
ఆనందపు అనుభూతుల
వెలుగులు మదినిండా పరిచేసి
దూరమైన మమతలన్నిటినీ
ఆప్యాయంగా కలిపేసి
నిజాయితీ చట్రంలో స్థిరంగా
నిలిచేలా కట్టేసి
విజయాల తీరాలు అందుకునే
హద్దులు చెరిపేసి
తీరవనుకున్న కోర్కెలు
చిత్రంగా తీర్చేసి
జీవితాంతం జీవితానికి
జీవికనిచ్చి జీవింపచేసే ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి