కొత్త చోటు కోసంనీటి పరుగులుకొత్త క్షణాలతోకాలం పరుగులుకదిలి పోతున్న ప్రవాహంకరిగి పోతున్న కాలంగతమయే క్షణాలురేపటిపై ఆశలుఅలసిన మనసునుఆదరించే అమ్మలాఓడిన వేదనకుఓదార్పిచ్చే ఊరటలాఅందాలు పొదుగుకున్నఅవని సౌందర్యంఅందరికీ కనువిందివ్వడమేఅపురూప అనుభవంకనుమల మధ్యన కమనీయప్రవాహంకన్నుల కింపైన ఏటి వయ్యారాలప్రయాణంఏటి దాపున ఇసుక తిన్నెలస్వాగతించే ఆహ్వానంమనసు పొందే ఏకాంతపుఅన్వేషిత ఆనందంప్రకృతి ఒడిలో ఒదిగితేతల్లి నీడలోని అనుభూతినిశ్శబ్దంలో వినిపించేఇంపైన మౌనగీతిఅందమైన దృశ్యాన్నిమరింత అనుపమంగా చేసేతేటవెలుగుల ఉదయానికి🌸🌸 సుప్రభాతం 🌸🌸
సుప్రభాత కవిత ; -బృంద
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి