ఎగురెయ్ ఎగురెయ్ మనజెండా
చాటెయ్ చాటెయ్ స్వాతంత్ర్యం
నీదా నాదా అని అనడం మాని
మనది అంటూ నడిచిన వేళ
ఊరు వాడ మురిసిన వేళ
ఎగిరిన భారత జెండా నీడన
అడుగెయ్ అడుగెయ్ ముందుకు
చాటెయ్ చాటెయ్ బాధ్యత
!!ఎగురెయ్!!
పేద ధనిక తేడా మాని
కులము మతము మాటలు మాని
ప్రాంతం వర్గం వర్ణన మాని
అందరూ ఒకటని సాగిన వేళన ఎగిరిన తిరంగ జెండా నీడన
అడుగెయ్ అడుగెయ్ ముందుకు
చాటెయ్ చాటెయ్ ఏకత
!!ఎగురెయ్!!
దేశ రక్షణకు బూనిన వేళ
సల సల రక్తం మరిగినవేళ
సద్భావననే గాంచిన వేళ
ఎగిరిన త్రివర్ణ జెండా నీడన
అడుగెయ్ అడుగెయ్ ముందుకు
చాటెయ్ చాటెయ్ ఐక్యత
!!ఎగరెయ్!!
బానిసత్వం వీడిన వేళ
విహంగం విహరించిన వేళ
పరిపాలన దక్షత మనదనువేళ
ఎగిరిన దేశపు జెండా నీడన
అడుగెయ్ అడుగెయ్ ముందుకు
చాటెయ్ చాటెయ్ స్వచ్చత
!!ఎగురెయ్!!
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి