సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -4
అచలచల న్యాయము
   *****
నాలుగు రోజుల నుంచి మనం వివిధ సంస్కృత న్యాయాల గురించి చర్చిస్తూ, తెలుసుకుంటున్నాం.
న్యాయము అంటే శాస్త్ర ప్రకారం ఏది తప్పు, ఏది ఒప్పు అని, వాటిలోని నిజా నిజాలను నిర్థారించి చెప్పేది.
అయితే తార్కిక, ఆధ్యాత్మిక దృష్టితో కొందరు పండితులు, కావ్య రచన చేసేవారు కొన్ని న్యాయాలను గురించి మరో కోణంలో చెప్పారు. అవే సాహిత్య పరంగా సంస్కృత, తెలుగు న్యాయాలుగా రూపుదిద్దుకుని నిత్య జీవితంలో సందర్భానుసారంగా ఉపయోగించబడుతున్నాయి.ఇవన్నీ మానవుల అనుభవాలు, నిశిత పరిశీలనల నుండి ఉద్భవించినవే.
వీటిని నాదైన శైలిలో వివరించడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది.
*****
ఈరోజు చర్చించే న్యాయము "అచలచల న్యాయము". 
 అచలము అనగా చలించని,కదలని అని అర్థం. మరి చల అంటే కదలడం అని అర్థం.
కదలనిది  కదిలినట్లు అనిపించడమే అచలచల న్యాయము.
కదలనిది కదలడమేమిటి అనే సందేహం కలుగుతుంది.
ఉదాహరణకు మనం ఓ ఓడలోనో, విమానంలోనో ప్రయాణం చేస్తూ ఉంటాం. అలా ప్రయాణంలో మనమేమో కదలకుండా ఉన్నట్లు,మన  చుట్టూ ఉన్న చెట్టూ చేమా మొదలగునవేమో కదులుతున్నట్లు కనిపిస్తూ ఉంటాయి. దీనినే అచల చల న్యాయము అంటారు.
మరో ఉదాహరణగా మన మనసును గురించి చెప్పుకోవచ్చు. మనిషి కదలకుండా అచలముగా ఓ చోట కూర్చుని ఉన్నా మనసు మాత్రం ఎక్కడెక్కడికో పరిభ్రమిస్తూ/ కదిలిపోతూ/చలిస్తూ వుంటుంది.
ఈ విధంగా మనం చేసే ప్రయాణంలో మనమేమో కదలకుండా ఉన్నట్లు,మన చుట్టూ ఉన్నవేమో కదులుతున్నట్లు అనిపించడాన్ని అచల చల న్యాయం అంటాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం