సిరులొలికే నవ్వులు చిన్నారి పాపలు
విరిసిన వెల్లువలు ప్రతి హృదయాన
పలకరింపు మొలకలు ప్రతి మదిలోన
మహనీయ శిల్పాలు దైవ హస్త కళా
నైపుణ్యాలు,
కళకళలాడు గృహాలు కమ్మని మాటల
ముద్దు ముద్దు పలుకుల తియ్యందనాలు
ఎవరండీ వీరు మన ఇంటి పసివారు
మన హృదయాన వెలుగు దివ్యరేఖలు
పసిడి దివ్వెలు ఇంటింటి వెలుగులు
పసివారి పలుకులు మధుర గీతాలు
పసివారున్న గృహం సంతోషాల నిలయం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి