ధైర్యం! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం చిన్నప్పటినుంచీ  పిల్లలకు జాగ్రత్తలు చెప్తూ ధైర్యం నూరిపోయాలి.పిల్లిని కూడా గదితలుపులు మూసి కొడితే దాడి చేస్తుంది. "బాబూ!అటు వెళ్లకు. పాపా!జాగ్రత్తగా నడు"అని పొద్దుగూకులూ హెచ్ఛరించరాదు.చెయ్యి పట్టుకుని నడవాలి. చీకట్లో దెయ్యం బూచి ఉంది అని భయపెట్టకుండా బ్యాటరీలైట్ ఇచ్చి నడవమనాలి.బాల్యం లో గాంధీజీ భయపడుతుంటే రంభ అనే దాసి అంది"బాబూ రామనామం అంటూ హనుమను తల్చుకో."చనిపోయే టైమ్ లో కూడా హేరామ్ అంటూ ప్రాణం వదిలారు ఆయన. ఆరోజు శివా బడికి వెళ్తుంటే కుక్కలు అరవసాగాయి.పరిగెడుతూ ఉంటే వెంట పడ్డాయి.రాయితో కర్రతో బెదిరించాడు.అంతే నోరుమూసాయి అవి.టీచర్ ఇవన్నీ చెప్పి "మీరు ఎక్జిబిషన్ కి వెళ్లితే మీఅడ్రస్ ఫోన్ నెంబర్  అన్నీ మీనోటికి వచ్చి ఉండాలి. మీమెడలో ఐడెంటిటీ కార్డు మీపేరు అడ్రసు ఉంచుకోవాలి. అమ్మా నాన్న చెయ్యి వదలవద్దు.పక్కన ఉన్న షాపువారికి చెప్పాలి.పిక్నిక్ విహారయాత్ర కి వెళ్ళినా అంతే!"అలాగే టీచర్ "అన్నారు అంతా🌹
కామెంట్‌లు