ఎదురయే దారులన్నీ
ఆమనులనీ
గడచిపోయిన క్షణాలన్నీ
తరిగిన దూరాలనీ
రెప్పలు దాటిన కలలన్నీ
కరిగే కన్నీరని
మదిలో అదిమిన కోరికలన్నీ
తెరువని ఉత్తరాలనీ
చిరునవ్వు అంచున దాగిన
నిర్వేదం
జీవితపు పరమార్ధమనీ
చేతిలో మిగిలిన సమయమే
అందుకోగల సంపదని
చంద్రుడులేని ఆకాశంలో
చుక్కలే వెలుగనీ
అల్లుకున్న బంధాలన్నీ
ఒకనాటికి విడిపోయేనని
ఆశవీడని అంతరంగమే
రేపటి వెలుగుకై చూసేనని
ఎఱుక కలిగి ఉండడమే
ఉత్తమ జీవన మార్గమనీ
చేతికందిన ఆనందమే
అదృష్టం అనీ
లేనిదానిపై కోరికలేక
కలిగినదే కలిమి అనీ
సంతృప్తి కలిగిన మనసుకు
ప్రతిరోజూ పండుగరోజే
ప్రతి ఉదయం నూతన
వసంతమే
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి