శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 బీహార్ లోని ముజఫుర్ లో ప్రాచీన నగరం వైశాలి.విశాల్ అనే రాజు నిర్మించాడు.ప్రస్తుతం దీన్ని వసాఢ్ అంటున్నారు.విశాల్ వైశాలి అనే రెండు ప్రయోగాలున్నాయి.ఒకటి రాజు పేరు రెండోది ఎన్నో సార్లు దీనిని విశాలంగా చేసిని రాణించడం.శాల అంటే ప్రాకారం గోడ!జాతక కథల్లో వర్ణన ప్రకారం ఈ నగరం మూడు గోడలతో ఆవరింపబడింది. ఒక్కో ప్రాకారం మధ్య రెండు కోసులదూరం ఉండేది ట!విశాల్ అనే రాకుమారుడు కోసల దేశం ఇక్ష్వాకు వంశంవాడు.ఏడోతరంవాడైన సుమతి రామలక్ష్మణులు విశ్వామిత్రుడికి ఆదరసత్కారంగావించాడు.ఓరాత్రి వారు అక్కడ గడిపి సీరధ్వజ జనకుని శివధనుర్భంగ సభకి హాజరైనారు.మహాభారతం కాలానికే వైశాలి కనుమరుగైంది.ఆపై గణరాజ్యంగా లిచ్ఛవీవంశం పాలించింది.ఒక ప్రత్యేక పుష్కరిణి నీటితో రాజుని అభిషేకించేవారు.దానికి గట్టికాపలా పెట్టేవారు.పక్షికూడా వాలటానికి వీల్లేదు.గౌతమబుద్ధుడు35వ ఏటనే జ్ఞాన ప్రాప్తికలిగాక ఎన్నో సార్లు వైశాలి నుంచి దర్శించాడు.ఆడవారి బౌద్ధ భిక్షుణీ సంఘం ఇక్కడే ఏర్పాటు చేయబడింది.ఆమ్రపాలివైశాలికి చెందిన ప్రసిద్ధ గణికబౌద్ధ భిక్షుణిగా మారింది.ఇకజైనా చార్యుడు వర్ధమాన మహావీరుడు తల్లి త్రిశాల ఈనగరంకి చెందినదే!బింబిసారుడు చంద్రగుప్త మౌర్య కని‌ష్క కి వైశాలి తో అనుబంధం ఉంది.కళలకు విద్యలకు కేంద్రమైన వైశాలి క్రీ.శ.600లో పతనమైంది.ఇలా చరిత్ర ప్రసిద్ధి కెక్కిన నగరం వైశాలి 🌹
కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం