అదొక పెద్ద భవంతి. అక్కడో పిల్లి. అది వేలాది ఎలుకలను తన బానిసలుగా చేసుకుంది. ఆ ఊరి ప్రజల నుంచి డబ్బు, బంగారు నాణేలు దొంగిలించేందుకు ఎలుకలను ఉపయోగించేది.
కొంతకకాలానికి ఎలుకలన్నింటికీ పిల్లిపై కోపమొచ్చింది. దాని తీరు ఏమాత్రం నచ్చలేదు. కనుక ఎలుకలన్నీ కలిసి పిల్లికి గుణపాఠం చెప్పాలనుకున్నాయి. అప్పుడు ఫుజి అనే ఎలుక అందుకు తన దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పి ఓ మ్యాప్ చేతిలోకి తీసుకుంది.
ఫుజి తన ప్రణాళికను ఇతర ఎలుకలకు చెప్పింది. మిగతా ఎలుకలన్నీ అందుకు అంగీకరించాయి.
అన్ని ఎలుకలూ కలిసి ఓరోజు పిల్లి దగ్గరకు వెళ్లి, "పిల్లి రాజా, మన దగ్గర మ్యాప్ ఉంది... ఆ మ్యాప్‌ను అనుసరిస్తే మనకు గొప్ప నిధి దొరుకుతుంది" అని చెప్పాయి.
పిల్లి ఎలుకల నుండి ఆ మ్యాప్ తీసుకొని, "నేనే వెళ్లి ఈ నిధిని తెలుసుకుంటాను. నాకు మీ సహాయం అవసరం లేదు" అని చెప్పింది.
పిల్లి మ్యాప్‌ని అనుసరించి నిధిని వెతకడానికి వెళ్ళింది. అయితే ఎలుకలు పిల్లికి తెలీకుండా రహస్యంగా దానిని అనుసరించాయి.
పిల్లి నడిచి నడిచి బాగా అలసిపోయింది.
విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్రదేశంలో కూర్చుంది.
కొంత సమయం తర్వాత పిల్లి మళ్లీ ప్రయాణం ప్రారంభించింది. పిల్లి మ్యాప్ ప్రకారం అక్కడికి చేరుకుని నిధి కిసం తవ్వడం ప్రారంభించింది.
పిల్లి తవ్వుతూనే ఉంది కానీ నిధి దొరకలేదు.
అప్పుడు పిల్లి బయటికి రాలేనంత లోతున తవ్వి లోపల కూరుకుపోయింది.
పిల్లి సహాయం కోసం అరిచింది.
అప్పుడు ఎలుకలన్నీ పై నుండి గొయ్యిలోకి చూశాయి. పిల్లి ఎలుకలను సహాయం కోరింది. కానీ ఎలుకలు సహాయం చేయడానికి నిరాకరించాయి.
వెంటనే ఆ పిల్లికి కోపం వచ్చి నేనే ఇప్పుడు పైకి వస్తే మీలో ఎవరినీ ఒంటరిగా వదలి పెట్టనని బెదిరించింది.
"ఎలుకల్లారా! ఇది దేవదూత నాకు ఇచ్చిన నిధి. మీకు నేను చిల్లి గవ్వ కూడా ఇవ్వను" అంది పిల్లి.
అయితే ఎలుకలు "మీరు దాని నుండి ఎప్పటికీ బయరాలేరు" అంటూ
ఎలుకలన్నీ కూడబలుక్కుని
పిల్లి ఉన్న ఆ గుంతను పూడ్చేశాయి.
తర్వాత గ్రామానికి తిరిగి వచ్చిన ఎలుకలు తాము దోచుకున్న నాణాలు, నగలు అన్నింటినీ గ్రామస్తులకు తిరిగి అప్పగించేసాయి.
అందుకు గ్రామస్తులు చాలా సంతోషించి ఎలుకలను అభినందించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి