యుక్తి-చాతుర్యం! అచ్యుతుని రాజ్యశ్రీ

 తెలివితేటలతో పాటు యుక్తి చాతుర్యం లేకుంటే మనం రాణించలేము.ముక్కు సూటిగా పోయి నిజం చెప్పితే  మనం అంతా తిడతారు.ఓరాజుగారు తన చిత్రంని గీయమన్నాడు.చిత్రకారుడు  మూడు చిత్రాలు గీసి మీకేది నచ్చితే అది తీసుకోండి అన్నాడు. మొద టి చిత్రం అంతా రాజు ధుమధుమ లాడే రూపం అందవిహీనంగా ఉంది. రాజు కి దాన్ని చూస్తూనే కోపం వచ్చింది. రెండోచిత్రం చాలా అందంగా ఉంది. తన కురూపి తనాన్ని హేళన చేస్తూ వ్యంగ్యంగా వేశాడని చిటపట లాడాడు.మూడో చిత్రం లో రాజు దోమతెరలో నిద్రిస్తున్నట్లు వేసిన చిత్రకారుని మెచ్చుకున్నాడు.మరీ నిజం చెప్పి బాధపెట్టకుండా నవ్వి ఊరుకోవాలి.అది యుక్తి చాతుర్యం 🌸
కామెంట్‌లు