మొట్టమొదటిసారిగా రేఖా టీచర్ ఆ పథకానికి శ్రీకారం చుట్టారు.
ఆ పథకం కారణంగా ఆమె పని చేస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో స్కూలుకి వస్తున్నారు. ఆమె అంటే అందరికీ ఇష్టం. అభిమానం.
ఇంతకూ ఇందుకు కారణమైన ఆ పథకం ఏమిటో చూద్దాం...
ఆ స్కూల్లో కొత్తగా చేరే పిల్లలకు ప్రతి ఒక్కరికి అదే రోజు వారి పేరిట వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తూ వస్తున్నారు రేఖా టీచర్. పదేళ్ళ తర్వాత అక్కడ చదువు ముగించుకుని బయటకు వచ్చేటప్పుడు వారి ఉన్నత చదువులకు ఆ డబ్బు ఎంతో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పథకం అది.
ఇంతకూ ఏ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది?
ఏ ప్రభుత్వమూ కాదు. ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచరుగా పని చేస్తున్న రేఖ ప్రత్యేకించి చేస్తున్న అద్భుత సేవ ఇది.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈమె 2010లో ఉడుపి సమీపంలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచరుగా చేరారు.
అప్పట్లో ఆ స్కూల్లో చాలా తక్కువ సంఖ్యలో ఉండే వారు విద్యార్థులు. పైగా ఎంతో వెనుకబడిన ప్రాంతమది.
రేఖ అక్కడి స్కూల్లో టీచరుగా చేరిన తర్వాత విద్యార్థినీ విద్యార్థుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వచ్చింది. పిల్లలు ఆ స్కూలుకి సంతోషంగా రావడం మొదలుపెట్టారు.
పెద్దలుకూడా తమ పిల్లలను అక్కడికి పంపడానికి ముందుకొచ్చారు.
ఇందుకు కారణం రేఖా టీచర్ చేపట్టిన వినూత్న పథకమే.
ఇది తెలిసి విద్యాధికారులు ఆశ్చర్యపోయారు.
రేఖా టీచర్ని పిలిచి వారు ప్రశంసించారు.
"ఎలా టీచర్, మీవల్లవుతోందిది? ఎందుకోసం మీ డబ్బులను ఈ పిల్లల పేరిట డిపాజిట్ చేస్తున్నారు?" అని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం...
"కారణం ఉంది. ఎందుకంటే మాది సాధారణ కుటుంబమే. నా స్కూలు చదువు అంత సులభంగా సాగలేదు. కొన్ని సేవా సంస్థలు, కొందరి పెద్దల మంచి మనసు అందించిన సహాయసహకారాలతోనే నా చదువు సాగింది. వారందరి చేయూతతో చదువుకోవడమే కాక ఈరోజు ఇలా టీచరుగా ఉన్నాను. అప్పుడు ఆలోచించాను. ఈ సమాజం నాకేదైతే ఇచ్చిందో దానిని తిరిగిచ్చి ఎంతో కొంత రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నామీదుందని. అందుకే 2014 నుంచి నాకు చేతనైన మేరకు ఈ చిన్నపాటి పని చేస్తున్నాను. ఈరోజు ఓ పిల్లాడి పేరిట నేను డిపాజిట్ చేస్తున్న వెయ్యేసి రూపాయలు స్వల్పమే కావచ్చు. పదేళ్ళ తర్వాత ఈ కనీసపాటి సొమ్ము వారికి అందుతుంది. అది వారి పైచదువులకు కొద్దో గొప్పో దోహదపడుతుందని నా అభిప్రాయం. ఇప్పటివరకు అరవై మూడు మంది పిల్లలకు ఇలా డిపాజిట్ చేశాను. ఈ టీచర్ వృత్తిలో ఉన్నంత వరకూ ఇలా వెయ్యేసి రూపాయలు కచ్చితంగా జమ చేస్తాను" అన్నారు రేఖా టీచర్.
ఇటువంటి వ్యక్తుల సేవా గుణం చెవినపడుతుంటే భవిష్యత్తుపై మనలోనూ ఒక నమ్మకం కలిగి తీరుతుంది కదూ!
ఈ సమాజం మనకిస్తున్న దానిని తిరిగివ్వవలసిన బాధ్యత మనందరిపైనా ఉందన్న ఈ పాఠం నేర్పిన రేఖా టీచరుకి కృతజ్ఞతలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి