ఎవరైనా నా గురించి చిల్లర మనిషని ఎవరన్నా అంటే అందుకు బాధపడను.
ఎందుకంటే శ్మశానం వరకూ చిల్లర నాణాలే అవసరమవుతాయి.
మరణించిన తర్వాత నుదుట ఉంచడానికి చిల్లర నాణమే కావాలి. అంతేతప్ప రెండు వేల రూపాయల నోటు అతికించి దహనం చేస్తే నిటు తాలూకు బూడిద కూడా లభించదు.
అన్నీ ఖర్చు పెట్టి బ్యాంక్ ఖాతాలో బ్యాలన్స్ కొన్నిసార్లు 99 రూపాయల 72 పైసలే ఉండొచ్చు. (ఒక్కొక్కసారి ఇంతకన్నా తక్కవ ఉన్న సందర్భాలూ ఉన్నాయనుకోండి). అయితే ఎటీఎంలో వంద రూపాయలైనా ఉంటే తప్ప ఆ వంద నోటు రాదు.అప్ఫుడు ఎవరికైనా ఫోన్ చేసి ఓ రూపాయి గూగుల్ పే చెయ్యమని చెప్పి ఆ వందా తీయడానికవుతుంది. అంటే అప్పుడా చిల్లర రూపాయి నాణానికున్న విలువ ఎంతో తెలిసింది కదూ.
కనుక చిల్లర మనిషిగా ఉండటం నాకేమీ ఇబ్బందికాదు.
అందుకే నేనొక చిల్లర మనిషిగా ఉండటానికే ఇష్టపడతాను.
యాచించేవారికి సహాయకారిగా
వేయి కోరికలు కోరుతూ హుండీలో వేయడానికీ
బస్సు ప్రయాణంలోనూ ఉపయోగపడే
చిల్లరగా ఉండాలనే కోరుకుంటాను.
సెల్ ఫోన్లు రాకముందర పబ్లిక్ టెలిఫోన్ బూత్ లలో మాటలాడటానికి ఉపయోగపడింది రూపాయి నాణమేగా
ఇప్పుడు చెప్పండి..
చిల్లరమనిషినా నేను?
అతనొట్టి చిల్లర మనిషండీ!!;-- యామిజాల జగదీశ్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి