వంక! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనకు ఏ దైనా నచ్చకుంటే వంకపెట్టి ఆపని చేయకుండా తప్పించుకుంటాం.ఇంకొందరు ప్రతివారిలో తప్పు వెతుకుతూ తమ గొప్ప చాటే ప్రయత్నాలు చేస్తారు. అమ్మ వంటకాలు నచ్చక వంకపెట్టి తినం.
శివా బామ్మ కూడా కోడలుచేసే వంట ని వంకలు పెడుతూ తింటుంది. "ఇవాళ అన్నం మేకులు బిరుసు!" రెండో రోజు "అబ్బ!లత్తిక !కాగితాలు అంటించుకునే గోందులా ఉంది." శివా ఇది గమనించి "అమ్మా!ఇవాళ మాఫ్రెండు వాళ్ళ బామ్మ చేసిన స్పెషల్ తెస్తా."అని ఆరోజు బాగా కారంవేసిన కాకరకాయ కూర కొయ్యలా ఉన్న చపాతీలు  చింతపండు పులిహోర తెచ్చాడు. అంతే ఆశగా నోట పెట్టిన బామ్మ గావుకేకవేసింది."ఒరే!మీఫ్రెండ్ వాళ్ళు ఎలాతింటున్నారురా బాబోయ్!" "నాకు చాలా బాగున్నాయి " శివా అనటంతో కిక్కురు మనలేదు ఆమె. అంతే ఆరోజు నించి కోడలివంటకి వంకలు పెట్టడంమానేసింది🌹
కామెంట్‌లు