"కనుమ"... అంటే కొండల నందు త్రోవ.. చాలామంది వ్యాసకర్తలు... వ్యాసాలలో
" కనుమ" అని పేర్కొంటున్నారు.... వాస్తవానికి ఇది తప్పే...
" కనుము" అంటే మకర సంక్రమణ పిదప రోజు పశువులకు జరుపుకునే పండుగ.
++++++++++++++++++++++++++++++++
సంక్రాంతి మూడవరోజును ‘కనుము’గా నిర్థారించారు మన పెద్దలు. ‘కనుము’ నేరుగా పండుగ కాదని పండుగను అనుసరించి వచ్చే పండుగ రోజు అని చెబుతారు.
భారతీయ సాంప్రదాయంలో ప్రతీ పండుగ మరుసటి రోజు వేడుక కనుము. ప్రతీ పండుగకు అభ్యంగన స్నానం, నూతన వస్త్ర ధారణ, దైవారాధన, బ్రాహ్మణులతో, బంధువులతో కలసి భుజించుటు, లేనివారికి అన్నదానం చేయుట, ఈ ఐదు పంచభూతాలకు మనం చేసే ఆరాధన. కనుము అనగా చూడుము, కలుపుము, తెలుపుము, తెలియుము, విడువుము అన్న ఐదు అర్థాలు ఉన్నాయి. ఈ రోజున పండుగ నాడు చేసిన పనులను ఒక్కసారి సింహావలోకనం(తలుచుకోవడం) చేసుకోవాలి. పండుగ నాడు మరిచిపోయిన వేడుకలను కనుము నాడు జరుపుకోవాలి. సామాన్యంగా ప్రతీ కనుమ నాడు నోములు నోచుకోవడం పరిపాటి. సంక్రాంతి కనుము నాడు గోదమ్మ నోము, కార్తిక కనుము నాడు గౌరమ్మ నోము, దసరా కనుము నాడు దుర్గమ్మ నోము, శ్రీరామనవమి కనుము నాడు సీతమ్మ నోము, ఇలా ఆయా అమ్మల పేరు మీద 10 మందిని పిలిచి భోజనాలు, వస్త్రాలు, వాయనాలు ఇచ్చి దీవెనెలు పొందాలి. స్వార్థం నశించడం, త్యాగం అల వడటం, మనకు ఉన్నది పది మందితో పంచుకోవడం ప్రతీ పండుగ ముఖ్యోద్ధేశ్యం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి