ఆషాపులో రకరకాల ఆభరణాలు తాము గొప్ప అంటే తామే గొప్ప అని కొట్లాడసాగాయి
"నన్ను చేతినిండా వేసుకుంటారు. గలగలమంటూ అందంగా రంగుల గాజు గాజుల మధ్య జిగేల్ అని మెరిసిపోతా"."ఓయబ్బో!మెడనిండా హారాలు!అందరిదృష్టి నాపైనే!" గొలుసు గొప్ప గా అంది."ఆడమగ పిల్లపాప మెడలో ధరిస్తారు. " ఇలా కాలి పట్టాలు కడియాలు వడ్డాణం వాదించుకుంటూ ఉన్నాయి.వెండితో కూడా మమ్మల్ని చేస్తారు.అంతా ధరిస్తారు "అని ఆనగలన్నీ ఎవరి డబ్బా వారు వాయించి కలహించుకునే సమయంలో వ్యాపారి వింటున్నాడు. ఆరోజు షాపు కి వచ్చిన వారంతా రకరకాల ఉంగరాలు చిన్న పాపకిమొదలు వధూవరులకి ఇంకా తమ జాతకాలకి సరిపోయే రాయి ముత్యం ఉన్న ఉంగరాలు కొంటున్నారు. అది చూసిన ఆ జగడా చేసే నగల నోళ్లు ఠక్కున మూతపడ్డాయి.🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి