మనసుకి తృప్తి;-- యామిజాల జగదీశ్
 అనగనగా ఓ ధనవంతుడు. ఆయన తన ఇంట ఓ దేవుడి శిల్పాన్ని అమర్చడానికి ఓ శిల్పి దగ్గరకు వెళ్ళాడు. 
ఆ సమయంలో శిల్పి ఓ స్త్రీ దేవతా విగ్రహాన్ని చెక్కుతున్నాడు. 
ధనవంతుడు శిల్పి చెక్కే తీరును పరిశీలించారు. అయితే అక్కడే అప్పటికే  చెక్కి ఉన్న ఇంకొక శిల్పాన్ని చూశాడు ధనవంతుడు. అదీనూ, చెక్కుతున్న శిల్పం ఒక్కలా ఉండటంతో ధనవంతుడికి ఆశ్చర్యం వేసింది.
దాంతో ధనవంతుడు "ఒకేలాంటి రెండు శిల్పాలను ఒకే ఆలయానికి ఇస్తున్నారా? లేక ఈ రెండు శిల్పాలను వేర్వేరు ఆలయాలకు ఇస్తున్నారా?" అని అడిగాడు.
శిల్పి నవ్వుతూ "కాదండీ....కింద ఉన్న ఆ  శిల్పం దెబ్బతిందండి...." అన్నాడు.
ధనవంతుడికి అర్థం కాలేదు. ఎందుకంటే ఆ శిల్పంలో అతనికి ఎలాంటి లోపమూ కనిపించలేదు. 
"ఏమంటున్నారు? ఆ శిల్పం పగిలిందా? అలా తెలియడంలేదే. అంతా బాగానే ఉందిగా" అన్నాడు ధనవంతుడు. 
అప్పుడా శిల్పి "శిల్పంలో ముక్కు భాగాన ఓ చిన్నపాటి గీత పడింది. చూడండి" అంటూ ఆ భాగాన్ని చూపించాడు.
“అవునవును. అది సరే. ఇంతకూ మీరు చెక్కుతున్న శిల్పాన్ని ఎక్కడ పెడతారు?" అడిగాడు ధనవంతుడు.
“దీనిని ఆలయ నలబై అడుగుల ఎత్తు కలిగిన గోపురం పైభాగాన అమరుస్తారండి" అన్నాడు శిల్పి.
ధనవంతుడు విస్తుపోయి "నలబై అడుగులలో అమర్చే ఈ శిల్పంలోని ముక్కు భాగాన ఉన్న గీత ఎవరికి కనిపిస్తుంది? ముక్కు భాగాన గీత పడిందని చెప్తే తప్ప నాకే తెలీలేదు. అలాంటిది అంత ఎత్తున పెట్టబోయే ఈ శిల్పంలోని స్వల్ప లోపం ఎవరికి కనిపిస్తుంది? ఇందుకోసం  ఇంకొక శిల్పాన్ని చెక్కుతున్నావా? ఎందుకు అమూల్యమైన కాలాన్ని వృధా చేసుకోవడం?" అని అడిగాడు.
”అవును, మీరన్నది నిజమే. అంత ఎత్తున పెట్టే ఈ శిల్పంలోని లోపం ఎవరికీ కనిపించకపోవచ్చు.  కానీ నాకు తెలుసుకదండీ ఆ శిల్పంలో ఉన్న లోపం. దానిని చూసినప్పుడే కాదండీ ఇలాగే గీత పడ్డ శిల్పాన్ని ఆలయానికి ఇచ్చినప్పటి నుంచి నా మనసు నన్ను ఏదో తప్పు చేసిన వాడిలా చూస్తూనే ఉంటుంది. దానికి నేనేం సమాధానం చెప్పగలను? అందుకే అది పక్కన పెట్టి మరొక శిల్పం చెక్కుతున్నాను" అన్నాడు శిల్పి.
ఈ కథ వల్ల తెలుసుకోవలసింది ఇదే...
ఇతరుల ప్రశంసల కోసం కాకుండా మనకిష్టమైన పనిని కష్టమనుకోకుండా  ఇష్టంగా చేస్తే మనసుకెంతో హాయిగా, నిండుగా, తృప్తిగా, ఆనందంగా ఉంటుంది.

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం