ఓ పులి పెళ్ళి చేసుకున్న సందర్భంగా విందు ఏర్పాటు చేసింది.
ఎన్నో జంతువులు ఆ విందుకు హాజరయ్యాయి. విందులూ పలకరింపులూ అన్నీనూ "పులి నవదంపతులకు" ఓ నాలుగు అడుగుల దూరం నుంచే జరిగాయి.
మగపులికి తెగ గర్వం. ఆహా ఓహో అనుకుంది మనసులో. ఇంతలో ఓ పిల్లి దగ్గరకొచ్చి పులిదంపతులకు షేక్ హ్యాండ్ ఇచ్చింది. విష్ చేసింది.
అప్పటివరకూ గర్వంతో ఉన్న పులికి చెడ్డకోపం వచ్చింది.
"ఓయ్ పిల్లీ! నీకెంత ధైర్యమే...విందుకొచ్చినవన్నీ నాలుగు అడుగుల దూరం నుంచి శుభాకాంక్షలు చెప్పిపోవడం నువ్వు చూడలేదా? నువ్వే ధైర్యంతో మా దగ్గరకొచ్చి షేక్ హ్యాండ్ ఇస్తావే. ఇంకొకసారి అలా చెయ్యివ్వు చూస్తాను" అంది ఆవేశంతో మగ పులి.
అంతట పిల్లి పెద్దగా నవ్వి, "ఓహో...నీకీ విషయం తెలీదేమో...పెళ్ళికి ముందర నేనూ పులినే. పెళ్ళయిన రెండు రోజులకే పిల్లినైపోయాను" అంటూ అక్కడి నుంచి పారిపోయింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి